Begin typing your search above and press return to search.

ఇప్ప‌టికి ఓటు లేదా?.. ఇలా తెచ్చేసుకోవ‌చ్చు!

By:  Tupaki Desk   |   9 Sep 2018 5:05 AM GMT
ఇప్ప‌టికి ఓటు లేదా?.. ఇలా తెచ్చేసుకోవ‌చ్చు!
X
ముంద‌స్తుకు వెళ్లాల‌న్న కేసీఆర్ ఆలోచ‌న‌తో తెలంగాణ రాజకీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. టీఆర్ ఎస్ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని షురూ చేస్తే.. అభ్య‌ర్థులు ప‌క్కా అనుకున్న స్థానాల్లో మిగిలిన పార్టీ నేత‌లు ప్ర‌చారాన్ని షురూ చేశారు. ఇలాంటి వేళ‌.. ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌నుకున్న వారికి ఓటు లేద‌న్న బాధ ఇప్పుడు పెరుగుతోంది.

అయితే.. ఇవాల్టికి ఓటు లేకున్నా (18 ఏళ్లు ఈ జ‌న‌వ‌రి 1 నాటికి నిండి ఉంటే) తెచ్చుకునే అవ‌కాశం.. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓటు వేసే వీలుంది. అలా ఎలా? అందుకున్న మార్గాలు ఎన్ని అన్న‌ది చూస్తే..

జ‌న‌వ‌రి 1 - 2018 నాటికి 18 ఏళ్లు నిండి ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఓటుహ‌క్కు కోసం అప్లికేష‌న్ పెట్టుకోవ‌టానికి అవ‌కాశం ఉంటుంది. వివిధ కార‌ణాలతో ఓటు లేని వారంతా కొత్త‌గా ఓటు హ‌క్కు పొందే వీలుంది. అంతేకాదు.. 2014 ఎన్నిక‌ల్లో ఓట్లు వేసిన వారు సైతం మ‌ళ్లీ ఒక్క‌సారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో ఓట్ల తొల‌గింపు భారీగా జ‌రిగిన నేప‌థ్యంలో మీ ఓటు ఉందా? లేదా అన్న‌ది చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక‌వేళ‌.. ఓటు గ‌ల్లంతై ఉన్నా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. అలా ఓట్లు మిస్ అయిన వారు సైతం ఓట‌ర్లుగా న‌మోదు చేసుకునే వీలు ఇప్ప‌టికి ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఓటు ఉన్న వారు ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా త‌మ ఓటు తాజా స్థితి గురించి తెలుసుకోవ‌టానికి ceotelangana.nic.in వెబ్ సైట్ ను చూసుకుంటే స‌రిపోతుంది. ఒక‌వేళ‌.. ఓటు కానీ గ‌ల్లంతై ఉంటే.. వెంట‌నే ఓట‌రుగా న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఓట‌రుగా న‌మోదు చేసుకోవటం ఎలానంటే..?

+ ఎన్నిక‌ల సంఘం అధికారిక వెబ్ సైట్ అయిన ceotelangana.nic.in & ERegistration & Assembly constituency & form6 (New Enrollment) పేజీలో ఫారం-6 పూరించి సమర్పించాల్సి ఉంటుంది.

+ పాస్ట్ పోర్టు ఫోటో.. వ‌య‌సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం.. ప‌దో త‌ర‌గ‌తి లేదంటే ఎనిమిదో త‌ర‌గ‌తి.. కాదంటే ఐదో త‌ర‌గ‌తి మార్క్స్ షీట్ .. పాస్ పోర్ట్‌.. పాన్ కార్డ్‌.. డ్రైవింగ్ లైసెన్స్.. ఆధార్ కార్డు లాంటి వ‌య‌సు.. నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

+ వ‌య‌సు.. నివాస ధ్రువీక‌ర‌ణ కోసం మొత్తం 11 ర‌కాల ప‌త్రాల్లో వేటినైనా అనుమ‌తిస్తారు.

+ అప్లికేష‌న్ ఫారం పూర్తి చేయ‌టం ద్వారా.. ఓట‌రు కార్డు పొందే అవకాశం ఉంటుంది.

ఓట‌ర్ల జాబితాలో పేరును తొల‌గించుకోవాలంటే..

ఇందుకోసం ఫారం 7ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మృతి చెందినా.. అదృశ్య‌మైన వారు కానీ వేరే ప్రాంతానికి వెళ్లినా త‌మ ఓటును తొల‌గించేందుకు ఫారం 7ను నింపాల్సి ఉంటుంది. ఇందులో త‌మ పేర్ల‌తో పాటు.. త‌మ కుటుంబ స‌భ్యుల పేర్ల‌ను కూడా తొల‌గించే వీలుంది.

త‌ప్పులు దొర్లి ఉంటే?

మీ ఓట‌రు కార్డులో పేరుకానీ.. చిరునామా కానీ మిగిలిన అంశాలు ఏవైనా త‌ప్పులు జ‌రిగి ఉంటే.. వాటిని మార్చుకునే సౌక‌ర్యాన్ని ఫారం 8 ద్వారా మార్చుకునే వీలుంది. ఇందులో ఓట‌ర్లుకార్డు.. గుర్తింపుకార్డు వివ‌రాల్ని న‌మోదు చేయాల్సి ఉంటుంది.

అడ్ర‌స్ మారితే..?

గ‌త ఎన్నిక‌ల నాటికి.. ఇప్ప‌టికి మ‌ధ్య అడ్ర‌స్ లో తేడా ఉంటే.. ఓట‌ర్ కార్డును మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటూ చిరునామా మారితే పారం

మృతి చెందినా - అదృశ్యమైనా - వేరేచోటికి వలస వెళ్లినా - పునరావృతమైనా.. అలాంటి వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు ఫారం-7ను పూరించాల్సి ఉంటుంది. ఇందులో తమ పేర్లతో పాటు కుటుంబీకులు - సంబంధీకుల పేర్లను కూడా తొలగించవచ్చు.

తప్పుల సవరణకు ఫారం-8

ఓటరు జాబితాలో పేరు - చిరునామా తదితర వివరాల్లో దొర్లిన తప్పులను ఫారం-8 ద్వారా సవరించుకోవచ్చు. ఇందులో ఓటరు కార్డు - గుర్తింపు కార్డు వివరాల్ని నమోదుచేయాల్సి ఉంటుంది.

చిరునామా మార్పునకు ఫారం-8ఏ

ఒకే నియోజకవర్గం పరిధిలో చిరునామా మార్పు ఉంటే ఫారం 8-ఏ ద్వారా మార్చుకునే వీలుంది. సో.. ఓటు లేకున్నా.. ఓటు మిస్ అయినా.. ర‌ద్దు అయినా ప‌ట్టించుకోకుండా వెంట‌నే ఓటు కోసం అప్లై చేస్తే స‌రిపోతుంది. సో.. ఇంకెందుకు ఆల‌స్యం.. మీ ఓటు ఉందో లేదో ఒక్క‌సారి చెక్ చేసుకోండి.