Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో కొత్త వేవ్ లు.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన..!

By:  Tupaki Desk   |   31 Dec 2022 10:30 AM GMT
కొత్త ఏడాదిలో కొత్త వేవ్ లు.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన..!
X
చైనాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అలర్ట్ అయింది. ఈ మేరకు కరోనా వేవ్ లపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా నిబంధనలను అన్ని దేశాలు 2020 నుంచి సడలించడంతోనే కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

కరోనాకు పుట్టినిల్లు అయినా చైనాలో అక్కడి ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని ఇటీవల ఎత్తివేసింది. ఈ నేపథ్యంలోనే చైనీయులంతా కరోనా బారిన పడుతున్నారు. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా పేషంట్లతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. కరోనా మృతదేహాలను కాల్చేందుకు కూడా సమయం దొరకని పరిస్థితి చైనాలో నెలకొందని ప్రచారం జరుగుతోంది.

చైనాలో ప్రస్తుతం నాలుగు వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒమ్రికాన్ వేరియంట్.. బీఎఫ్ 7 వేరియంట్ సహా మరో రెండు కొత్త వేరియంట్లు కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ పెరుగుతున్న కేసులపై కీలక ప్రకటన చేసింది.

ఇటీవలి కాలంలో కోవిడ్ ఆంక్షలు సడలించడంతోపాటు పలు కారణాలతో వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని వేవ్ లు తప్పవని హెచ్చరించింది. ఒమిక్రాన్ వేరియంట్ లో 500లకు పైగా సబ్ వేరియంట్స్ ఇప్పటికే వ్యాప్తిస్తున్నాయని వెల్లడించింది.

చైనాలో కరోనా కేసులు తీవ్రంగా వెలుగు చూస్తుండటం ఆందోళనకరమని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షలు సడలించడం వల్లే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ అధికంగా వ్యాపిస్తుందన్నారు. కొన్ని ఒమిక్రాన్ వేరింయట్లకు రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు.

అయితే వీటిని నిరోధించేందుకు సరైన ఔషధాలు సిద్ధంగా ఉండటం ఉపశమనం కలిగించే అంశమని మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే కరోనా ప్రభావం పెరిగిందన్నారు. చైనాతో పాటు ఆయా దేశాల్లో వృద్ధులు.. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి.. ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలన్నారు. అవసరమైన మందులు.. బెడ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.