Begin typing your search above and press return to search.
కొత్త రైటర్ వచ్చాడు.. అదరగొడుతున్న లోకేశ్
By: Tupaki Desk | 29 Feb 2020 9:30 PM GMTనాయకత్వ లక్షణాలు లేకున్నా.. ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగ తీరు లేకున్నా.. ప్రజల్లో అభిమానం లేకున్నా తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఉన్నాడు. ఏకంగా మంత్రి అయ్యి.. పార్టీలో కీలక పదవికి ఎంపికయ్యాడు. అయితే తండ్రి ఎంత వెనకేసుకొస్తున్నా అతడి అవగాహన రాహిత్యం, అమాయకత్వం ప్రజల ముందు బహిర్గతమవుతోంది. దీంతో తీవ్ర అభాసుపాలవుతున్నాడు. కనీసం మాట్లాడే తీరు కూడా తెలియదు. తెలుగులో రెండు నిమిషాలు సక్రమంగా మాట్లాడకపోవడంతో ఎన్నికల సమయం లో ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు ఎంతో వినోదం అందింది. దీన్ని గమనించిన అతడి తండ్రి కుమారుడి కోసం ఎంతో తపన పడ్డాడు. అతడికి మంచి తెలుగు పాఠాలతో పాటు రాజకీయ పాఠాలను నేర్పించేందుకు కొందరిని నియమించాడు. వారు సక్రమంగా నేర్పకపోవడంతో అదే పరిస్థితి ఉంది. అయితే తాజాగా మరో రైటర్ ను నియమించారంట. ఎవరికంటే టీడీపీ అధినేత కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కే.
ప్రస్తుతం వచ్చిన రైటర్ పనితనం అతడిలో మార్పు కనిపిస్తోంది. ఆయన వచ్చినప్పటి నుంచి లోకేశ్ లో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికకు లోకేశ్ ఓ భారీ వ్యాసం రాశాడు. జగన్, మీ విశ్వసనీయత మిథ్య అంటూ ఓ సగం పేజీ వ్యాసం రాశాడు. జగన్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, కార్యక్రమాలు, పథకాలను ప్రస్తావిస్తూ జగన్ ను విమర్శిస్తూ వ్యాసం రాశాడు. అయితే గతానికి భిన్నంగా లోకేశ్ వ్యాసం రాశాడు. ఏకంగా భారీ వ్యాసంలో గణాంకాల తో సహా వ్యాసం రాయడం అందరినీ ఆశ్చర్యం వేసింది. పట్టుమని రెండు నిమిషాలు తెలుగు లో మాట్లాడలేని వ్యక్తి అచ్చ తెలుగులో దాదాపు ఐదారు వేల పదాలతో కూడిన వ్యాసం గమనార్హం.
తాజాగా లోకేశ్ శనివారం ట్విట్టర్ లో గతానికి భిన్నంగా.. వ్యంగ్యం గా జగన్ పాలనను విమర్శించారు. లోకేశ్ కోణంలో ఆ విధంగా ఏనాడూ ఊహించలేం. అల వైకుంఠపురం లో సినిమాలోని ‘సిత్తరాల సిరపడు..’ పాటను వ్యంగ్యంగా తీసుకుని జగన్ పాలనను విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ ట్వీట్లు ఈ విధంగా ఉన్నాయి..
మొదటిది..
‘‘శుక్రవారం వస్తే చాలు, స్కూల్ పిల్లలు సాకులు చెప్పి, బడి ఎగ్గొట్టినట్టు ఉంటాయి జగన్ గారి కష్టాలు. ప్రతి రోజు తాడేపల్లి ఇంట్లో పబ్జీ ఆడి కాలక్షేపం చేస్తూ, శుక్రవారం వస్తే తాను సీ.యం అని గుర్తుకు వచ్చి, ఏదో ఒక రివ్యూ పెట్టి, కోర్ట్ కు డుమ్మా కొడతారు.’’
‘‘విచిత్రాల జగ్గడు.
చట్టం లేకుండానే పోలీస్ స్టేషన్ రిబ్బన్ కత్తిరించాడు..
న్యాయం చెయ్యమంటే చట్టం దిశ తప్పి ఢిల్లీ వెళ్లిందంటాడు.. ’’
‘‘విచిత్రాల జగ్గడు.
కంటికి నేనే వెలుగిచ్చా అంటాడు
ఆయన కంటికి తప్ప అందరికీ గతంలోనే వెలుగొచ్చిందనే విషయం తెలిసి నాలుక కరుచుకుంటాడు.’’
‘‘విచిత్రాల జగ్గడు
ఇంగ్లీష్ కి అన్నని నేనే అంటాడు
స్టేజి మీద పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడించి ముందే ఇంగ్లీష్ ఉందని దొరికిపోతాడు’’
ఈ విధంగా ట్వీట్లు చేసి కొంత ఆకట్టుకున్నాడు. ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం కూడా సమగ్రంగా ఉంది. ఈ విధంగా లోకేశ్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియా లో నెటిజన్లు దీనిపై చర్చిస్తున్నారు. లోకేశే
రాశాడా.. లేదా ఎవరితోనైనా రాయించడా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా లోకేశ్ కు పాఠాలు నేర్పే వ్యక్తి వలన సాధ్యమైందని మరికొందరు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు ఒక రైటర్ ను, మరికొందరినీ లోకేశ్
ను బాగు చేసేందుకు నియమించారని, వారి వలన లోకేశ్ లో కొంత మార్పు వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఈ మార్పు వారి వలన వచ్చిందా.. లేదా అనే స్వతహాగా చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా లోకేశ్ లో ఈ మాత్రం మార్పు వస్తేనే ఇలా ఉంటే ఇక భవిష్యత్ లో ఇంకెన్ని చలోక్తులు విసురుతాడోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. లోకేశ్ మారిపోయాడు.. అని సోషల్ మీడియా కామెంట్లు వస్తున్నాయి.