Begin typing your search above and press return to search.

న్యూఇయర్ హంగామా.. తాగి ఊగారు

By:  Tupaki Desk   |   2 Jan 2022 4:53 AM GMT
న్యూఇయర్ హంగామా.. తాగి ఊగారు
X
కొత్త సంవత్సరాన్ని జనాలు గ్రాండ్ గా ఆహ్వానించారు. మందు, విందు, చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వేడుకలంటే మద్యం ఖచ్చితంగా ఉండాల్సింది. న్యూ ఇయర్ అంటేనే మద్యం వేడుక.. మద్యం లేని న్యూ ఇయర్ వేడుక లేదు. కుర్రకారు, పెద్దలు, ఆఖరుకు ఆడవారు కూడా తాగి ఎంజాయ్ చేస్తున్నారు.

ఏపీ, తెలంగాణల్లో న్యూ ఇయర్ సందర్భంగా రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణనే టాప్. ఏపీ పూర్తిస్థాయిలో పోటీ ఇవ్వలేకపోతోంది.

తెలంగాణలో నిన్న ఒక్కరోజే ఏకంగా 171 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు సాగినట్టుగా తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువే. నిన్న మాత్రమే కాదు.. గత ఐదు రోజులుగా తెలంగాణలో సగటున రోజుకు 150 కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు సాగాయి. డిసెంబర్ నెల అంతా కలిపి 3400 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైందట.. గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఈసారి అదనంగా 700 కోట్ల రూపాయల మద్యం అమ్మడం గమనార్హం.

ఏపీ మద్యం అమ్మకాల్లో వెనుకబడింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో నిన్న ఒక్కరోజే 120 కోట్ల రూపాయల మద్యం మాత్రమే అమ్మినట్లు సమాచారం. జనాభాలో తెలంగాణ కన్నా పెద్దదే అయినా ఏపీలో మాత్రం తక్కువ మద్యం అమ్మడం గమనార్హం. బహుషా చీప్ మద్యం, బ్రాండెడ్ మద్యం లేకపోవడంతోనే పక్కరాష్ట్రాల నుంచి తెచ్చుకున్నారని.. అవే తాగి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.