Begin typing your search above and press return to search.
న్యూయార్క్ మానవబాంబర్ పాస్ వర్డ్ ఇదే
By: Tupaki Desk | 13 Dec 2017 11:27 AM GMTఅగ్రరాజ్యమైన అమెరికాను.. కోట్లాది మంది అమెరికన్లను ఉలిక్కిపడేలా చేసింది న్యూయార్క్ మానవ బాంబు పేలుడు. రెండు రోజుల క్రితం న్యూయార్క్ లోని భూగర్భ మెట్రో రైల్వే స్టేషన్లో ఒక ఆగంతకుడు తనను తాను పేల్చేసుకోవటం ద్వారా భారీ విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే.
అయితే.. ఆత్మాహుతి దాడికి సంబంధించి బాంబును సరిగా పేల్చటంతో విఫలం కావటంతో భారీ ప్రాణనష్టం తృటిలో తప్పింది. ఈ ఉదంతంలో మానవబాంబర్ తో పాటు మరో నలుగురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే..ఈ మానవ బాంబు పేలుడుకు సంబంధించి షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది.
మానవ బాంబర్.. తాను చేయాల్సిన పని చేయటానికి ముందు ఫేస్ బుక్ లో తాను చేయనున్న పనని నర్మగర్భంగా చెప్పేస్తూ పోస్ట్ పెట్టారు. ట్రంప్ నీ దేశాన్ని కాపాడుకోవటంలో విఫలమయ్యావ్.. అంటూ పోస్ట్ పెట్టారు. బాంబు పేలుడు అనంతరం సూసైడ్ బాంబర్ వివరాల్ని సేకరించే సమయంలో అతడి ఫేస్ బుక్ అకౌంట్ ను గుర్తించారు. ఈ సందర్భంగా అతడి పాస్ వర్డ్ ను అధికారులు గుర్తించారు. అమెరికా డై పేరుతో పాస్ వర్డ్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. తాను పేలుళ్లకు పాల్పడుతున్న విషయాన్ని అకయొద్ ముందుగా సోషల్ మీడియాలో పరోక్షంగా ప్రకటించారు. అయితే.. ఆ విషయం తర్వాతనే గుర్తించారు. ఇక.. ఫేస్ బుక్ లో మానవ బాంబర్ ప్రకటన చూస్తే.. ట్రంప్ నువ్వు నీ దేశాన్ని కాపాడుకోలేకపోయావ్ అంటూ ఎక్కడ పంచ్ వేయాలో అక్కడ వేయటం కనిపిస్తుంది. తాజా పరిణామాలు అమెరికన్ అధికారులకు షాకింగ్ గా మారాయి.