Begin typing your search above and press return to search.
ట్రంప్ కు షాకిచ్చిన న్యూయార్క్ కోర్టు.. 2 మిలియన్ డాలర్లు ఫైన్
By: Tupaki Desk | 8 Nov 2019 5:26 AM GMTఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పదవుల్లో ఉన్న అధినేతలకు ఎదురుకాని అనుభవం డోనాల్డ్ ట్రంప్ కు ఎదురైందని చెప్పాలి. న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆయన కు షాకింగా మారిందని చెప్పాలి. కోర్టు ఆదేశాల్ని చూసినప్పుడు.. ఒకరకంగా అధ్యక్షుల వారికి న్యాయస్థానం ఫైన్ విధించిందని చెప్పాలి. కాకుంటే.. ఆ పదం లేకున్నా.. తీర్పు సారాంశం అదే విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.
రెండు మిలియన్ డాలర్లు.. మన రూపాయిల్లో చూస్తే రూ.14.25 కోట్ల మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు (ఎన్జీవోలకు) చెల్లించాలని కోర్టు పేర్కొంది. ఎందుకిలా? అసలు కేసేమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో తన రాజకీయ ప్రయోజనాల కోసం తమ కుటుంబం నిర్వహించే ట్రంప్ ఫౌండేషన్ కు వచ్చిన నిధుల్ని అక్రమంగా వినియోగించారన్నది అభియోగం.
దీనిపై విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు.. ట్రంప్ ఫౌండేషన్ మీద వచ్చిన ఆరోపణల్ని నిజమన్న విషయాన్ని తేల్చటంతో పాటు.. దీనికి బదులుగా రూ.14.25 కోట్ల మొత్తాన్ని ఎన్జీవోల కు చెల్లించాలని తీర్పును ఇచ్చారు. ఈ కేసును విచారించిన జస్టిస్ సాలియన్ స్కార్సుల్లా.. మొత్తం ఎనిమిది ఎన్జీవోలకు ట్రంప్ ఈ భారీ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల వేళలో ట్రంప్ ఫౌండేషన్ కు వచ్చిన నిధుల్ని ట్రంప్ దుర్వినియోగం చేశారంటూ న్యూయార్క్ అటార్నీ జనరల్ జేమ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన న్యాయస్థానం తాజాగా తీర్పును ఇచ్చింది. దీనిపై స్పందించిన ట్రంప్.. కోర్టు ఇచ్చిన తీర్పును అటార్నీ జనరల్ తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెప్పారు.
ట్రంప్ ఫౌండేషన్ చేసిన కొన్ని చిన్నపాటి సాంకేతిక తప్పిదాల నేపథ్యంలో కోర్టుతో తమకు ఒప్పందం కుదిరిందంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఏమైనా.. ఒక ఆరోపణకు కోర్టు సానుకూలంగా స్పందించి.. తీర్పు ఇవ్వటమంటే తప్పు జరిగిందనేగా? కానీ.. ట్రంప్ వారు మాత్రం కిందపడినా పైచేయి తనదే అన్న రీతిలో కోర్టు తీర్పును తనకు తగ్గట్లు అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తే తన తీరును తప్పు పట్టిన వేళ.. అటార్నీ జనరల్ గా వ్యవహరిస్తున్న జేమ్స్ స్పందిస్తూ.. సేవా కార్యక్రమాల కోసం కేటాయించిన నిధులు పక్క దారి పట్టకుండా చేసే విషయంలో తాము చేసిన ప్రయత్నాలు సఫలమైనట్లుగా ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. మొత్తానికి తాజా తీర్పు ట్రంప్ వారిని ఇబ్బందిని పెట్టిందని చెప్పక తప్పదు.