Begin typing your search above and press return to search.

న్యూయార్క్‌ కి తొలి ఎన్నారై న్యాయమూర్తి

By:  Tupaki Desk   |   8 March 2023 8:38 PM GMT
న్యూయార్క్‌ కి తొలి ఎన్నారై న్యాయమూర్తి
X
న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన అమెరికన్ న్యాయవాది అరుణ్‌ సుబ్రమణియన్‌ ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్‌ చేశారు. న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్ కోర్ట్‌ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మొదటి భారతీయ అమెరికన్‌ గా అరుణ్‌ రికార్డు సాధించారు.

యూఎస్ సెనేట్‌ లో అరుణ్‌ సుబ్రమణియన్ నామినేషన్‌ కు 58-37 ఓట్ల తేడాతో మద్దతు లభించింది. అరుణ్‌ సుబ్రమణియన్‌ న్యూయార్క్‌ సదరన్ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ న్యాయమూర్తిగా ఎంపిక అయ్యారు అంటూ సెనేట్‌ జ్యుడిషియరీ కమిటీ అధికారికంగా ట్వీట్‌ చేయడం జరిగింది.

1970 ల్లో అరుణ్‌ తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. అరుణ్‌ తండ్రి పలు సంస్థల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో విధులు నిర్వహించారు. ఆయన తల్లి కూడా అమెరికాలో ఉద్యోగం చేశారు. 1979 లో అరుణ్‌ సుబ్రమణియన్ జన్మించారు. 2004 లో కొలంబియా లా స్కూల్ నుండి జ్యూరియస్ డాక్టర్‌ పట్టా పొందారు.

2006 నుండి 2007 వరకు యునైటెడ్‌ స్టేట్స్ సుప్రీం కోర్టు లో జస్టిస్‌ రూత్‌ బాడర్ గిన్స్‌ బర్గ్‌ కు క్లర్క్ గా వ్యవహరించారు. గత కొంత కాలంగా ఎన్నో కీలక కేసుల్లో అరుణ్‌ తన వాదనలు వినిపించారు. ముఖ్యంగా చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ లో ట్రాఫికింగ్ బాధితురాలు తరపున ఇంకా అన్యాయంగా కేసుల్లో చిక్కుకున్న వారి తరపున కూడా వాదించారు. అమెరికాలో ఎన్నో గౌరవాలను పొందిన అరుణ్ ఇప్పుడు న్యూయార్క్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి గా ఎంపిక అయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.