Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌: న‌్యూయార్క్ లో ఉగ్ర‌దాడి..8 మంది మృతి

By:  Tupaki Desk   |   1 Nov 2017 5:22 AM GMT
బ్రేకింగ్‌: న‌్యూయార్క్ లో ఉగ్ర‌దాడి..8 మంది మృతి
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో ఉగ్ర‌దాడి జ‌రిగింది. భార‌త కాల‌మాన ప్ర‌కారం ఈ రోజు (బుధ‌వారం) తెల్ల‌వారుజామున ఒక ట్ర‌క్కు న్యూయార్క్ వీధుల్లో బీభ‌త్సం సృష్టించింది. 2011 త‌ర్వాత న్యూయార్క్ రాష్ట్రంలో జ‌రిగిన అతి పెద్ద దాడిగా న్యూయార్క్ పోలీసులు అభివ‌ర్ణిస్తున్నారు.

కొన్ని యూర‌ప్ దేశాల్లో అనుస‌రించిన వ్యూహాన్నే న్యూయార్క్ లోనే ఉగ్ర‌వాది అనుస‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. భారీ వాహ‌నాల్ని ఇష్టారాజ్యంగా న‌డిపేసి.. అమాయ‌క పౌరుల్ని చంపేసే ప్లాన్ ను న్యూయార్క్ లోనూ అమ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న స్కూల్ బ‌స్సును ట్ర‌క్కుతో ఢీ కొట్టి పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడో ఉగ్ర‌వాది.

ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా..11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెబుతున్నారు. స్కూల్ బ‌స్సును ఢీ కొట్టి పారిపోతున్న ఉగ్ర‌వాదిపై అమెరిక‌న్ పోలీసులు కాల్పులు జ‌రిపారు. గాయ‌మైన అత‌ను.. ట్ర‌క్కు దిగి అల్లాహోఅక్బ‌ర్ అంటూ నినాదాలు చేస్తూ పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడు.

అత‌డ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన న్యూయార్క్ మేయ‌ర్ జ‌రిగింది ఉగ్ర‌దాడేన‌ని ప్ర‌క‌టించారు. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తిని ఉజ్బెకిస్తాన్ కు చెందిన సైపోవ్ గా అధికారులు గుర్తించారు. 2010లో అమెరికాకు వ‌చ్చిన అత‌గాడికి గ్రీన్ కార్డు ఉన్న‌ట్లు గుర్తించారు. న్యూజెర్సీలోని ఓ డిపో నుంచి అద్దెకు తీసుకున్న ట్ర‌క్కుతో తాజా దుర్మార్గానికి పాల్ప‌డిన‌ట్లుగా గుర్తించారు. తాజా ఘ‌ట‌న‌తో న్యూయార్క్ లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.