Begin typing your search above and press return to search.

మోడీ చేసిన పని త‌ప్పంటున్న అమెరికా

By:  Tupaki Desk   |   25 March 2017 4:22 PM GMT
మోడీ చేసిన పని త‌ప్పంటున్న అమెరికా
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించే అమెరికా మీడియా తాజాగా నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్‌ను ఎంపికచేసి భారత ప్రధాని మోడీ తప్పుచేశారని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంపాదకీయం రాసింది. పత్రిక కథనంపై వెంటనే స్పందించిన భారత్ ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవ‌లి ప‌రిణామాల‌ను విశ్లేషిస్తూ న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకీయంలో ప్రధాని మోడీని విమర్శించింది. బీజేపీ అజెండా హిందుత్వంను నరేంద్రమోడీ 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రోత్సహిస్తూ వస్తున్నారని పేర్కొంది. ఆర్థిక ప్రగతి, అభివృద్ధి దిశగా లౌకిక తత్వాన్ని ప్రోత్సహించాల్సింది పోయి... హిందూత్వాన్ని బలపరిచేందుకు విపరీత గేమింగ్‌ను ప్రదర్శిస్తున్నారని మండిప‌డింది. కరుడుగట్టిన హిందుత్వవాదులను ప్రోత్సహిస్త్తున్నారు. మైనారిటీ వర్గమైన ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తూనే యోగి ఆదిథ్యనాథ్ రాజకీయకంగా ఎదిగారని తెలిపింది. యూపీకి అభివృద్ధి కావాలిగానీ సైద్ధాంతిక నాయకత్వం కాదంది. మోడీ చర్యల్లో విచార సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. మోడీ ఆర్థిక విధానాలు అభివృద్ధి దిశగా ఉన్నాయి. కానీ అవి నూతన ఉద్యోగాలను సృష్టించలేకపోతున్నాయని తెలిపింది.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తూ వెంటనే తిప్పికొట్టింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారిక ప్రతినిధి గోపాల్ భాగ్లే స్పందిస్తూ.. అది పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహరమన్నారు. యూఎస్ డైలీ తన అభిప్రాయాన్ని రాసేందుకు స్వతంత్య్రతను కలిగిఉంది. కానీ స్వేచ్ఛను ప్రశ్నార్హం చేసేలా ఆ వ్యాఖ్యానం ఉందన్నారు. అన్ని సంపాదకీయాలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతుంటాయి. కానీ ఇది అటువంటిది కాదన్నారు. నిజాయితీ పద్దతుల్లో జరిగిన ప్రజాస్వామ్య నిర్ణయాల తీర్పుపై స్వదేశంలో గానీ, విదేశంలోగానీ అపహాస్యం చేసేలా విమర్శిస్తే అవి ప్రశ్నర్హమైనవని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/