Begin typing your search above and press return to search.
భారత్ దెబ్బ... సెమీస్ లో కీవీస్ చెత్త రికార్డు
By: Tupaki Desk | 9 July 2019 11:36 AM GMTప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు భారత పేస్ బౌలింగ్ ద్వయం భువనేశ్వర్ కుమార్- బుమ్రా ధాటికి పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతోంది. తొలి బంతికే తృటిలో వికెట్ కోల్పోయే పరిస్థితి నుంచి బయట పడ్డ న్యూజిలాండ్ ఈ టోర్నమెంట్ లోనే ఓ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.
తొలి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 27 పరుగులు చేసింది. ఫలితంగా ఈ మెగా టోర్నీలో తొలి పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇప్పటి వరకూ ఇంగ్లండ్ పై భారత్ చేసిన 28 పరుగులు పవర్ ప్లేలో అత్యల్ప స్కోరుగా ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ దానిని బీట్ చేస్తూ సరికొత్త చెత్త గణాంకాలు మూటకట్టుకున్న జట్టుగా నిలిచింది.
ఇక ఈ కీలక మ్యాచ్ లో భారత జట్టు ఓ కీలక మార్పుతో బరిలోకి దిగింది. కేవలం మూడు మ్యాచ్‌లలోనే 14 వికెట్లు తీసి ఫుల్ ఫాంలో ఉన్న పేసర్ మహ్మద్ షమీని కాదని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ ఉండడంతోనే మేనేజ్ మెంట్ జడేజా వైపు మొగ్గు చూపింది. ఇక కోహ్లీ తాను టాస్ గెలిచినా ముందు బ్యాటింగ్ చేసేవాడిని అని చెప్పారు.
ఇక భువనేశ్వర్, బుమ్రా ఇద్దరూ కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ తొలి ఫోర్ 8 ఓవర్లో కొట్టింది. గఫ్టిల్ బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఏదేమైనా సెమీస్ లో భారత్ ఆరంభంలో పైచేయి సాధించింది.