Begin typing your search above and press return to search.
సూయజ్ లో చిక్కుకున్న ఐపీఎల్ క్రికెటర్..!
By: Tupaki Desk | 31 March 2021 1:30 AM GMTన్యూజిలాండ్ క్రికెటర్ నీషమ్ కు ఓ నెటిజన్ కు ఆసక్తికరమైన సంభాషణ సాగింది. మధ్యలో ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ కూడా కౌంటర్ ఇవ్వడంతో ఈ చర్చ మరింత రసకందాయంలో పడింది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 జరగబోతున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టుకు కీవిస్ ఆటగాడు నీషమ్ ఎంపికయ్యాడు. అయితే నీషమ్ ను ఆ ట్విట్టర్ లో ఓ నెటిజన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ‘ఏంటి నీషమ్ ఐపీఎల్ కు ఎప్పుడొస్తున్నావు’ అంటూ ప్రశ్నించాడు. దీనికి నీషమ్ తనదైన స్టయిల్ లో వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. ’నేను ఐపీఎల్ కు రావాలని రెడీ అయ్యాను. కానీ సూయజ్ కాల్వలో చిక్కుకున్నా అందుకే ఎప్పుడొస్తున్నానో.. తెలియదు’ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పాడు.
ఇటీవల సూయజ్ కాల్వలో ఓ భారీ పడవ ఇరుక్కున్న విషయం తెలిసిందే. దీంతో వేల కోట్ల రూపాయలు నష్టమైంది. చివరకు ఆ నౌకను విడిపించగలిగారు. అయితే నీషమ్ పెట్టిన రిప్లై ఫన్నీగా ఉండటంతో నెటిజన్లు ఫిదా అయ్యారు. మధ్యలో దూరిన మ్యాక్స్‌వెల్ అయితే నెటిజన్‌కు.. నీషమ్ కు ఆసక్తికరమైన సంభాషణ సాగుతుంటే.. ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ మధ్యలో దూరాడు. నీషమ్ ను రెచ్చగొట్టేలా మరో రిప్లై ఇచ్చాడు. 'ఏంటి జేమ్స్ నీషమ్.. పడవలో నువ్వు మాత్రమే వస్తున్నావా... లేక 46, 44, 46 బరువులు కూడా మోసుకొస్తున్నావా? అంటూ ఓ కౌంటర్ వేశాడు. తొలుత ఈ కౌంటర్ ఎవరికీ అర్థం కాలేదు.
అసలు విషయం ఏమిటంటే ఇటీవల కీవిస్ జట్టు .. ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో జేమ్స్ నీషమ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ వరసగా 4,6,4,4,4,6 ప్రతి బాల్‌ను బౌండరీగా లేదా సిక్సర్‌గా మలిచాడు. నెటిజన్లకు అందుకే మ్యాక్స్‌వెల్ ఆ బరువులు అంటూ ఆ అంకెలు వేశాడని అర్థం చేసుకొని నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మ్యాక్స్‌వెల్ గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో 14.5 కోట్లకు అమ్ముడుపోయాడు మ్యాక్స్‌వెల్. కానీ ఏ మాత్రం ఫర్ఫామెన్స్ చూపించలేకపోయాడు. దీంతో పంజాబ్ జట్టు అతడిని వదులుకున్నది. ప్రస్తుతం ఆర్సీబీ కొనుగోలు చేసింది.