Begin typing your search above and press return to search.
వీధి కుక్కల చేతికి చిక్కిన చిన్నారి ఏమైందంటే..
By: Tupaki Desk | 17 Jun 2017 12:45 PM GMTమనుషుల్లో మానవత్వం నానాటికీ దిగజారిపోతోందనడానికి నిదర్శనమీ ఘటన. అభం శుభం తెలియని చిన్నారి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించిందో తల్లి. ముక్కు పచ్చలారని పసికందును నిర్దాక్షిణ్యంగా నడి వీధిలో విసిరేసి చేతులు దులుపుకుంది. వీధి కుక్కల దాడిలో అన్యం పుణ్యం ఎరుగని ఆ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో శనివారం జరిగింది. ఆ కసాయి తల్లి నవజాత శిశువును రోడ్డు పక్కన పడేసిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేరు. దీంతో, వీధి కుక్కలు ఆ శిశువుపై స్వైర విహారం చేశాయి. శిశువును నోట కరుచుకుని నిమిషాల్లో పీక్కుతిన్నాయి.
కొద్దిసేపటికి అటుగా వచ్చిన స్థానికులు కుక్కలను తరిమిసేలోపు శిశువు ప్రాణాలు కోల్పోయింది. మరణించిన శిశువును మగబిడ్డగా గుర్తించారు.గ్రామస్థుల ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శిశువును కని పారేసింది ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఛిధ్రమైన శిశువు శరీరాన్ని చూసి స్థానిక మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/