Begin typing your search above and press return to search.
పుట్టుకతోనే కరోనా సోకింది..మృత్యువుతో పోరాటం
By: Tupaki Desk | 14 March 2020 8:34 AM GMTప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను ప్రపంచ దేశాలన్నీ నియంత్రించలేకపోతున్నాయి. ఎన్నో జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకుంటున్నా ఆ వైరస్ విశ్వవ్యాప్తమవుతోంది. కరోనా కల్లోలం చేస్తుండడంతో ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో కరోనా భయం తీవ్రంగా ఉంది. అయితే తాజాగా ఆ కరోనా బారిన ఓ శిశువు పడిందనే సమాచరామే ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. పుట్టుకతోనే కరోనా వైరస్ తో పుట్టడంతో ప్రజలంతా నివ్వెరపోతున్నారు. ఈ లోకంలోకి కరోనా వైరస్ తోనే బయటకు రావడం అందర్నీ ఆవేదనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువు పోరాడుతోంది. ఈ ఘటప బ్రిటన్ లోని లండన్ లో చోటుచేసుకుంది.
అయితే ఆమె వివరాలు తెలియకపోయినా జరిగింది మాత్రం లండన్ లో. మిడిల్ సెక్స్ లో ఓ నిండు గర్భిణీ కొద్ది రోజుల క్రితమే న్యూమోనియా జ్వరంతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆస్పత్రికి చేరగా.. ఆమెను వైద్యులు పరీక్షలు చేశారు. ఆ నివేదికల్లో ఆమెకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ అని తేలడంతో అక్కడి వారందరూ అప్రమత్తమయ్యారు. పాజిటివ్ గా నివేదిక వచ్చింది. అయితే కొన్ని రోజులకు ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లికి కరోనా ఉండడంతో బిడ్డకు కూడా సోకిందేమోనని వైద్యులు పరీక్షలు చేశారు. ఆ పుట్టిన శిశువుకు కూడా కరోనా వైరస్ వ్యాపించిందని తేలడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో తల్లీ - కూతుళ్లను ఇద్దరినీ వేర్వేరు ఆస్పత్రులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.