Begin typing your search above and press return to search.

రాత్రి లేని చోటు.. నిత్యం ఉషోదయమే..

By:  Tupaki Desk   |   22 Jun 2018 1:30 AM GMT
రాత్రి లేని చోటు.. నిత్యం ఉషోదయమే..
X
అదో వింత గ్రహం.. మన గురు గ్రహం కంటే నాలుగు రెట్ల పెద్దది. అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయం పరిశోధకులు దీన్ని గుర్తించారు. ఈ గ్రహాన్ని ప్రత్యక్షంగా ఫొటోలు కూడా తీయగలిగారు. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత ఎంతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు. 50 డిగ్రీలకే మనం మలమల మాడిపోతున్నాం. ఆ గ్రహంపై ఏకంగా 580 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని తేల్చారు. అయితే అంత ఉష్ణోగ్రత ఎందుకు ఉందని ఆరాతీస్తే ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ గ్రహం చుట్టూ మూడు సూర్యుళ్లు పరిభ్రమిస్తున్నాయి. అంటే ఆ గ్రహంలో మూడు సూర్యోదయాలు.. మూడు సూర్యస్తమయాలు ఉంటాయి. దీంతో అసలు రాత్రి అనేది లేని గ్రహంగా పేరొందింది. దీనికి పేరు కూడా పెట్టారు శాస్త్రవేత్తలు. నక్షత్రాల గుంపు సెంటరస్ లో గుర్తించిన ఈ గ్రహానికి హెచ్.డీ 131399 అని నామకరణం చేశారు.

ఈ గ్రహంలో ఒకరోజు అంటే మనిషి జీవితకాలం కంటే ఎక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే పగలు మాత్రమే ఉండి.. రాత్రి లేని గ్రహం ఇది అట. ఒకరోజు తనచుట్టూ తాను తిరగడానికి వందల ఏళ్లు పడుతుందని తేల్చారు.

ఏడాదిలో నాలుగోవంతు అక్కడ సూర్యోదయంలోనే ఉంటుందని తేల్చారు. రాత్రి అనేది ఈ గ్రహంలో దాదాపు లేదనే చెప్పాలి. అంతేకాదు ఈ గ్రహం వయసు 1.6 కోట్ల సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ గ్రహం భూమికి 340 కాంతి సంవత్సరాల దూరంగా ఉందని గుర్తించారు. రాత్రి అనేదే లేని ఈ గ్రహం ఇప్పుడు శాస్త్రవేత్తలను విపరీతంగా ఆకర్షిస్తోంది.