Begin typing your search above and press return to search.

లాక్డౌన్ తో ఇరుక్కుపోయిన బంధువులు.. కొత్త దంపతులకు నరకం

By:  Tupaki Desk   |   7 May 2020 2:30 AM GMT
లాక్డౌన్ తో ఇరుక్కుపోయిన బంధువులు.. కొత్త దంపతులకు నరకం
X
కొత్తగా పెళ్లైంది. దంపతులిద్దరూ కోటి ఆశలతో ఉంటారు. ముద్దు మురిపానికి ప్రైవసీ కోసం తపిస్తారు. కానీ లాక్ డౌన్ వారి సంతోషాన్ని చిదిమేసింది. వారికి సంసార సుఖాన్ని లేకుండా చేసింది. లాక్ డౌన్ కు సరిగ్గా రెండురోజుల ముందు పెళ్లి చేసుకున్న జంటకు కొత్త కష్టం వచ్చిపడింది. బంధువులంతా ఇంట్లోనే లాక్ డౌన్ తో బందీ అయిపోయారు. దీంతో కొత్త దంపుతులు.. ఆ కుటుంబం ఇంత మందికి భోజన ఇతర సౌకర్యాలు చేయలేక... వారి ప్రైవసీ చూసుకోలేక.. అష్టకష్టాలు పడుతున్నారట..

కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ఒక జంటకు లాక్డౌన్ కు ముందు మార్చిలో పెళ్లైంది. విశాఖ నుంచి బంధువులంతా పెళ్లికి హాజరయ్యారు. లాక్ డౌన్ తో చిక్కుకుపోయారు. 40 రోజులుగా బంధువులంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో కొత్త జంటకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. వారికి ప్రైవసీ లేకుండా పోయింది. ముద్దు మురిపెం.. సంసార సుఖానికి కూడా ఇంట్లో స్థలం లేక బంధువులతో ఇళ్లంతా నిండిపోయిందట.. 40 రోజులుగా వీరికి తిండి ఇతర సౌకర్యాలు కల్పించలేక.. వారిని పంపించడానికి లాక్ డౌన్ తో మార్గం లేక ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోందట..

అసలే రూపాయి ఆదాయం లేని టైం.. పైగా బంధువులంతా ఇంట్లోనే ఉండడంతో వారిని పోషించలేక అధికారులు, పోలీసులకు సమస్య విన్నవించారట.. కానీ సొంత వాహనాలుంటేనే పంపిస్తామని.. ట్యాక్సీలు, ఇతర వాహనాల్లో అంతమందిని పంపించమని పోలీసులు స్పష్టం చేశారు.

దీంతో వారిని పంపలేక.. ఇంట్లో భరించలేక ఆ కొత్త దంపతులు నరకం అనుభవిస్తున్నారు. చేతుల్లో డబ్బులు కూడా అయిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదట..

ఇలా ఈ ఒక్కచోటే కాదు.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మోడీ సార్ విధించిన లాక్ డౌన్ కారణంగా చాలా మంది చాలా ప్రాంతాల్లో బంధువుల వద్ద ఇరుక్కుపోయారు. వారు ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియక.. బంధువులకు భారం కాలేక.. ఇక ఉన్నచోట ఉపాధి, తిండి లేక నరకం చూస్తున్నారు. వీరి విషయంలో కేంద్ర రాష్ట్రాలు స్పందిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు.