Begin typing your search above and press return to search.

నాగిని డ్యాన్స్.. వరుడి పెళ్లిని పెటాకులు చేసింది..

By:  Tupaki Desk   |   12 Nov 2019 1:30 AM GMT
నాగిని డ్యాన్స్.. వరుడి పెళ్లిని పెటాకులు చేసింది..
X
పెళ్లి ఘనంగా జరిగింది. బరాత్ మొదలైంది. డీజే చప్పుళ్లు, డప్పులకు పెళ్లికొడుకుకు మూడ్ వచ్చేసింది. ఫంక్షన్ హాల్ ముందు డ్యాన్స్ చేస్తున్న అతడి ఫ్రెండ్స్ పెళ్లికొడుకును ఆహ్వానించారు. దీంతో తన పెళ్లి లోనే సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టాడు వరుడు. నాగిని డ్యాన్స్ చేసి ఇరగొట్టేశాడు. అయితే అంత బాగా డ్యాన్స్ చేస్తున్న వరుడి హుషారును చూసి ఎంజాయ్ చేయాల్సిన వధువు షాకింగ్ డెసిషన్ తీసుకుంది. వరుడికి షాకిచ్చింది.

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేర్ లోని మైలానీ ప్రాంతంలో ఓ జంటకు వివాహం జరిగింది. ఫంక్షన్ హాల్ లో రిసెప్షన్ వేళ పెళ్లి జోష్ కనిపిస్తోంది. తన స్నేహితులు బలవంతం చేయడంతో ఆ ఫంక్షన్ హాల్లోనే పెళ్లికొడుకు నాగిని డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నాడు.

ఈ క్రమంలోనే వేదికమీదకు రావాలని పెళ్లి కూతురు తరుఫు వాళ్లు వచ్చి పెళ్లికొడుకును ఆహ్వానించారు. అయితే అప్పటికే ఓ బీర్ కొట్టిన వరుడు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ పెళ్లికూతురు బంధువులు ఓపిక పట్టి అతడిని వేదికపై తీసుకెళ్లి దండలు మార్పించారు.

అయితే మళ్లీ స్నేహితులు పిలవడంతో వేదిక దిగి నాగిని డ్యాన్స్ మొదలు పెట్టాడు వరుడు. దీంతో విసిగిపోయిన వధువు తనకు ఈ పెళ్లి వద్దంటూ చెప్పి వేదిక దిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుడి వైఖరి నచ్చక వధువు విడాకులు తీసుకుంది. ఇలా వరుడి అత్యుత్సాహం.. నాగిని డ్యాన్స్ అతడి పెళ్లిని పెటాకులు చేసింది..