Begin typing your search above and press return to search.
ఘనంగా పెళ్లి చేసిన మేనమామ... కానీ మూడు నెలల్లోనే ఘోరం !
By: Tupaki Desk | 24 March 2021 11:30 AM GMTచిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయిన ఆ అమ్మాయికి ఆ లోటు ఏనాడూ తెలియనివ్వకుండా పెంచాడు మేనమామ. అలాగే భారీగా కట్నం ఇచ్చి, మంచి ఉద్యోగం ఉందని పెళ్లి చేశాడు. పెళ్లి కూడా ఘనంగా చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయల కట్నం, 20 తులాల బంగారాన్ని వరుడికి కట్నంగా ఇచ్చాడు. అయితే , ఆ అమ్మాయి పెళ్లి జరిగిన మూడు నెలల్లోనే జీవితం మీద విరక్తి తో తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే .. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మాల్దార్ పేటకు చెందిన 20 ఏళ్ల యువతికి , తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. దీంతో ఆమె బాగోగులను ఆమె మేనమామే చూసుకున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదివించాడు. 20 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి చేశాడు. నంద్యాల పట్టణంలోనే చింతరుగు వీధికి చెందిన రాజేష్ అనే వ్యక్తితో జనవరిలో పెళ్లిని ఘనంగా జరిపించాడు. అతడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుంటాడు. పెళ్లి సమయంలో అబ్బాయి తరపు వాళ్లు అడిగినంత కట్నం ఇచ్చారు. దాదాపు 15 లక్షల రూపాయలతో పాటుగా 20 తులాల బంగారాన్ని కూడా ఆమెకు కానుకగా ఇచ్చాడు. తల్లిదండ్రులు లేని పిల్ల అని బాగా చూసుకోవాల్సిన భర్తే, ఆమెపై వేధింపుల పర్వాన్ని మొదలు పెట్టాడు. తన వ్యాపారం కోసం అదనపు కట్నం తేవాలని ఆమెను హింసించాడు. తన కోసం ఇప్పటికే తన మామయ్య ఎన్నో త్యాగాలు చేశాడనీ, తనను చదివించి, భారీగా ఖర్చు పెట్టి పెళ్లి కూడా చేశాడనీ, ఇప్పుడు అదనపు కట్నం కోసం తనను హింసిస్తున్నారని మేనమామతో చెప్పలేనని ఆ యువతి ఆవేదనకు గురయింది. పెళ్లయిన మూడు నెలల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి తెలిసిన మేనమామ కన్నీటిపర్యంతమయ్యాడు. మనీషా భర్త రాజేశ్, అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టాడు. తనకు ఫోన్ చేసి విషయం చెప్తే ఏదో ఒకటి చేసేవాడిని కదమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాడు.