Begin typing your search above and press return to search.
ప్యారిస్ ఘటన ట్రయిల్ మాత్రమేనంట..!
By: Tupaki Desk | 23 Nov 2015 9:02 AM GMTవరుస ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు.. తమదైన రాక్షసత్వంతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇప్పుడు మరో వార్నింగ్ వీడియోను విడుదల చేశారు. ఇటీవల నరమేధం సృష్టించిన ప్యారిస్ ఉగ్రదాడి జస్ట్ ట్రయిల్ మాత్రమేనని.. త్వరలో అంతకు మించి చాలానే దారుణాలు చేస్తామంటూ హెచ్చరించటం ఇప్పుడు తాజా కలకలంగా మారింది. జీఐజో: దఇ రైస్ ఆఫ్ కోబ్రా చిత్రంలోని ఒక వీడియో క్లిప్ ను ఐఎస్ విడుదల చేసింది.
ఈ వీడియోలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటే ఈఫిల్ టవర్ ను ఒక క్షిపణి ఢీ కొట్టటంతోపాటు.. చిన్న రోబోటిక్ డిస్ట్రాయిర్స్ విధ్వంసం చేసే సినిమా క్లిప్పింగ్ ను ఉంచింది. క్షిపణితో ఢీ కొట్టటం ద్వారా.. ఈఫిల్ టవర్ అందరూ చూస్తుండగానే నదిలో కూలిపోతుంది. ఈఫిల్ టవర్ కూలిపోయే దృశ్యాలున్న ఈ వీడియో ద్వారా తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.
పారిస్ కుప్పకూలిపోయిందన్న పేరు పెట్టి మరీ విడుదల చేసిన ఈ చిత్రంలో.. 2009లో జీఐజో: దఇ రైస్ ఆఫ్ కోబ్రా పేరిట ఒకచిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఈపిల్ టవర్ కూలిపోయే సీన్ ఉంటుంది. అదే సీన్ మళ్లీ రిపీట్ అవుతుందన్న తమ హెచ్చరికకు సినిమా క్లిప్ ను జత చేసి మరీ ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఆ సీన్ చూస్తున్నప్పుడు భయంతో ఒళ్లు ఎంతగా గగుర్పాటుకు గురి అవుతుందో.. తాము దాడికి దిగినప్పుడు అంతే భయాందోళనలు కలగటం ఖాయంగా చెప్పుకొచ్చింది. తాజా వీడియో వ్యవహారం చూసినప్పుడు.. విధ్వంసపు ఆలోచనలతో ప్రపంచాన్ని భయపెట్టాలన్నదే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తుంది.