Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ కు అమెరికా 100 స్విచ్ బ్లేడ్లు
By: Tupaki Desk | 18 March 2022 9:33 AM GMTఉక్రెయిన్ కు అమెరికా ఆత్మాహుతి డ్రోన్ల ను అందిస్తోంది. దీనికే స్విచ్ బ్లేడ్ అని పేరుంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు అమెరికా నుంచి అనేక రకాల ఆయుధాలు, ఆయుధ సామగ్రి అందింది. వీటికి అదనంగా తొందరలోనే స్విచ్ బ్లేడ్లు అందబోతున్నాయి. దీంతో శతృవుల యుద్ధ ట్యాంకులు, తక్కువ ఎత్తులో ఎగిరే యుద్ధ విమానాలతో పాటు ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసేయచ్చు.
దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శతృవుల కదలికలను, వాళ్ళ కాన్వాయ్ ని కూడా స్విచ్ బ్లేడ్ డ్రోన్ల ద్వారా పసిగట్టేయచ్చు. వెంటనే వీటిని దూరం నుండే శతృవులపైకి ప్రయోగించటానికి వీలవుతుంది. అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్ధ స్విచ్ బ్లేడ్ 300, స్విచ్ బ్లేడ్ 600 అనే రెండురకాల ఆత్మాహుతి ద్రోన్లను తయారుచేసింది. ఇవేమీ ఇపుడు కనబడుతున్న న్లంత పెద్దవిగా ఉండవు. చాలా చిన్నగా ఎంతంటే ప్యాంటు బ్యాక్ పాకెట్లో కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోవచ్చు.
వీటిని గాల్లోకి ప్రయోగించగానే శతృవుల కదలికలను గమనిస్తుంటాయి. ఒకసారి కదలికలను పసిగట్టగానే వెంటనే కంట్రోల్ యూనిట్ కు సంకేతాలను పంపుతాయి. కంట్రోల్ యూనిట్ నుండి సిగ్నల్ అందగానే వెంటనే దాడిచేస్తాయి. ముందు ప్రయోగించినపుడు మామూలుగానే ఉన్నా గాల్లో లేచిన తర్వాతే బ్లేడ్లు తెరుచుకుంటాయి. అందుకనే వీటిని స్విచ్ బ్లేడ్లని అంటున్నారు. ఇవి యుద్ధ ట్యాంకులను కూడా పేల్చేయగలవు. స్విచ్ బ్లేద్ బరువు కేవలం 2.5 కిలోలు మాత్రమే ఉంటుంది. 10 కిలోమీటర్ల టార్గెట్లను కూడా చాలా ఈజీగా ఛేదిస్తాయి.
గతంలో వీటిని ఆఫ్ఘనిస్ధాన్లో అమెరికా సైన్యం తాలిబన్లపైన ఉపయోగించింది. కొండల్లో పర్వతాల్లో ఎక్కడెక్కడో దాక్కునుండే తాలిబన్లను గుర్తించి సిగ్నల్ ఇచ్చేందుకు, ఆదేశాలు రాగానే దాడులు చేసేందుకు స్విచ్ బ్లేడ్లు బాగా ఉపయోగపడ్డాయి. స్విచ్ బ్లేడ్ ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ఇపుడు ఉక్రెయిన్ కు ఇవ్వబోతోంది. ఇప్పటికే 800 స్టింగర్ క్షిపణులను, దాదాపు 2 కోట్ల చిన్న ఆయుధాలు, 25 వేల శరీర కవచాలు, 25 వేల హెల్మెట్లు, 100 రాకెట్ లాంచర్లు, 5 వేల రైఫిల్స్, 400 మిషన్ గన్లు, 400 షాట్ గన్లను అమెరికా అందించింది. వీటికి అదనంగా 100 స్విచ్ బ్లేడ్లను కూడా అందిచబోతోంది.