Begin typing your search above and press return to search.

7న జ‌రిగేదే.. వారికి ఆఖ‌రి కేబినెట్ స‌మావేశ‌మా?

By:  Tupaki Desk   |   4 April 2022 9:10 AM GMT
7న జ‌రిగేదే.. వారికి ఆఖ‌రి కేబినెట్ స‌మావేశ‌మా?
X
ఏపీలో కొత్త జిల్లాల కూర్పు అయిపోయింది. ఇక‌, సీఎం జ‌గ‌న్ భావిస్తున్న సంచ‌ల‌న మార్పుల్లో కేబినెట్ మార్పు కూడా ఉంది. దీనికి కూడా ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 11న మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుం దన‌ని.. ఇప్ప‌టికేతాడే ప‌ల్లి వ‌ర్గాల నుంచి స‌మాచారం బ‌య‌ట‌కు పొక్కింది. అయితే... ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గంలో ఎవ‌రు ఉంటారు? ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌స్తారు? అనే చ‌ర్చ అనేక రోజులుగా సాగుతూనే ఉంది. అయితే.. ఈ విష‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ నెల 7న జ‌ర‌గ‌నున్న కేబినెట్ స‌మావేశంపై అంద‌రి దృష్టీ ప‌డింది.

ఈ నెల 7న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వాస్త‌వానికి ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కు ఒక‌సారి కేబినెట్ బేటీ అవుతోంది. అయితే.. గ‌తానిక‌న్నా భిన్నంగా తాజాగా జ‌ర‌గ‌నున్న కేబినెట్ భేటీపై అనేక చ‌ర్చ‌లు న‌డుస్తు న్నాయి. దీనికి కార‌ణం.. ప్ర‌స్తుత మంత్రి వ‌ర్గానికి ఇదే ఆఖ‌రి భేటీ అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డ‌మే. మెజారి టీ మంత్రులకు ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వీరికి ఇదే ఆఖ‌రి కేబినెట్ అవు తుంద‌ని అంటున్నారు. ఆ రోజే సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌స్తుత‌మంత్రివ‌ర్గంలో తాను ఎంచుకున్న‌వారిని రిజైన్ చేయాల‌ని కోరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. అదే రోజు.. అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలంటూ.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌.. ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఆయా విభాగాల అంశాల‌పై కేబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం కూడా ఉంది. ఏదేమైనా.. ఈ స‌మావేశంలో మంత్రుల‌తో రిజైన్ లెట‌ర్ల‌పై చ‌ర్చించి.. కొత్త కేబినెట్ కూర్పుపైనా.. ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీనిని బ‌ట్టి.. 30 నెల‌లుగా సాగుతున్న కేబినెట్‌కు ఇదే ఆఖ‌రి స‌మావేశం అవుతుంద‌ని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి తన కొత్త మంత్రివర్గం ఏప్రిల్ 11న ప్రమాణస్వీకారం చేయాలని యోచిస్తున్నారని, దాని కోసం ప్రస్తుత మంత్రుల రాజీనామాలను గవర్నర్‌కు పంపుతారని తాడేప‌ల్లి నేత‌లు చూచాయ‌గా చెబుతున్నారు. క్యాబినెట్ మంత్రులందరూ రాజీనామా చేయడం వల్ల ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో తాజా పేర్లను ప్ర‌క‌టించ‌డంతోపాటు, కొత్త‌ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం.

ఇక‌, మంత్రి వ‌ర్గం రాజీనామా విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయడం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఇది రెండవసారి. 1985లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు తర్వాత ఎన్టీ రామారావు మొత్తం మంత్రి వ‌ర్గాన్ని ర‌ద్దు చేశారు. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న నాదెండ్ల భాస్కరరావు శిబిరాన్ని ఖాళీ చేసేందుకు ఎన్టీఆర్ తన మంత్రులందరినీ రాజీనామా చేయించి, అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాడు. 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయడంతో చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం ఉంది.