Begin typing your search above and press return to search.

ఆ సామాజిక వర్గాలకు నో చాన్స్...?

By:  Tupaki Desk   |   10 April 2022 8:59 AM GMT
ఆ సామాజిక వర్గాలకు నో చాన్స్...?
X
ఏపీలో కొత్త మంత్రి వర్గం కూర్పులో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ ప్రయారిటీ ఈసారి ఇస్తున్నారు. దాంతో గత క్యాబినెట్ లో కనిపించిన కొన్ని సామాజిక వర్గాలకు ఈసారి బెర్త్ దక్కే చాన్స్ లేదని అంటున్నారు. గత కాబినెట్ లో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాధరాజుకు అవకాశం లభించింది. అలాగే ఆర్య వైశ్యుల కోటాలో వెల్లంపల్లి శ్రీనివాస్ కి కూడా మంత్రి పదవి లభించింది.

ఇపుడు కొత్త మంత్రివరం కూర్పు చూస్తూంటే ఈ రెండు సామాజికవర్గాల నుంచి ఎవరినీ ఎంచుకోవడంలేదని అంటున్నారు. ఆర్య వైశ్య కోటాలో విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని చాలా కాలంగా వినిపిస్తున్న మాట.

అయితే మరోసారి బొత్సనే కంటిన్యూ చేయడంతో కోలగట్ల ఆశలకు బ్రేక్ పడిపోయింది అంటున్నారు. ఇక అదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే వేరే జిల్లాలో ఉన్నా సమాజిక సమీకరణలతో అక్కడా నో చాన్స్ అనేస్తున్నారు. ఇక క్షత్రియులు రాజకీయంగా ఫోకస్డ్ గా ఉండే పశ్చిమ గోదావరిలో ఎపుడూ ఒక బెర్త్ ఇస్తారు.

టీడీపీ టైమ్ లో కూడా అలాగే చేసేవారు. జగన్ సైతం అలా శ్రీరంగనాధరాజుకు తొలి చాన్స్ ఇచ్చినా ఎన్నికల క్యాబినేట్ లో మాత్రం నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మంత్రి పదవి లేదని తెలుస్తోంది. ఆయన‌కు బదులు కాపు వర్గానికి చెందిన బలమైన నేత పవన్ని ఎన్నికల్లో ఓడించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి చాన్స్ ఇచ్చేశారు.

ఇక బ్రాహ్మణులకు గతంలో మంత్రి పదవి ఇవ్వలేదు. ఆశావహుల్లో సీనియర్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి కూడా పదవిని ఆశిసున్నారు. అయితే ఈ ఇద్దరికీ కూడా సామాజిక సమీకరణల కారణంగా మంత్రి పదవి ఇవ్వడంలేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ మూడు సామాజిక వర్గాలూ కలిపినా ఏపీలో వారికి పెద్దగా బలం లేనందువల్లనే లైట్ తీసుకున్నారా అన్న చర్చ వస్తోంది.