Begin typing your search above and press return to search.

మాట మార్చిన కేసీయార్

By:  Tupaki Desk   |   22 March 2022 5:00 AM GMT
మాట మార్చిన కేసీయార్
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటమార్చారు. దేశంలో మార్పు అవసరం కొత్త రాజకీయ పార్టీ రావచ్చనే సంకేతాలిచ్చారు. పనిలోపనిగా తమది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కాదని, ప్రజల మేలుకోరే రాజకీయ ఫ్రంటుగా అభివర్ణించుకున్నారు. మొన్నటి వరకు నరేంద్రమోడిని అది చేసేస్తా, ఇది చేసేస్తాని చాలెంజ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరు ఏకమవ్వాలంటు పిలుపిచ్చారు. బీజేపీని అధికారంలో నుండి ఎలా దింపాలో ఆలోచించాలన్నారు. ఇపుడేమో తమది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కాదని ఎందుకు చెప్పారో ?

జాతీయ రాజకీయాల్లో తాను కీలకపాత్ర పోషించబోతున్నట్లు మాత్రం చెప్పారు. రాజకీయాల్లో ముందు ముందు ఏమి జరగబోతోందో ఎవరికి తెలుసంటు ఎదురు ప్రశ్నించారు. యూపీఏ పరిస్థితి కన్నా ఇపుడు దేశంలో పరిస్ధితులు మరింత దిగజారిపోయాయన్నారు. జనాలంతా ఈ విషయాన్ని గమనించినట్లు కూడా చెప్పారు. కేసీయార్ చెప్పినట్లు జనాలంతా ఈ విషయం గమనిస్తే మరి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఎలా గెలిపిస్తారు ?

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏ ఏ అంశాల్లో అయితే కేసీయార్ కేంద్రాన్ని నిలదీస్తున్నారో అవే అంశాలు రాష్ట్రంలోను ఉన్నాయి. దేశంలో ఉద్యోగాలను కేంద్రం ఎందుకు భర్తీ చేయలేదని నిలదీస్తున్నారు. మరి గడచిన ఎనిమిదేళ్ళుగా తెలంగాణలో తానెందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదో చెప్పరు. ఎన్డీఏ పాలనలో దేశంలో అరాచకం పెరిగిపోతోందన్నారు. కేసీయార్ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతోందని ప్రతిపక్షాలంటున్నాయి.

సరే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తనకు బాగా సన్నిహితుడని చెప్పారు. ఎప్పటినుండి సన్నిహితుడు, ఎలా సన్నిహితుడో మాత్రం చెప్పలేదు. తాను ఆహ్వానిస్తేనే పీకే తెలంగాణాకు వచ్చినట్లు చెప్పారు. ఏదేమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టంగా చెప్పారు. మరైతే ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే కేసీయార్ చెప్పేదొకటి చేసేదొకటి కాబట్టి.