Begin typing your search above and press return to search.
సోము వీర్రాజు బీజేపీని తిడితే ఎట్లుంటది?
By: Tupaki Desk | 2 April 2022 12:30 AM GMTఏమయినా మాట్లాడండి అది దేశం కోసం ధర్మం కోసం అయి ఉండాలి అని బీజేపీ చెబుతూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఉండాలని దేశ పౌరులకు ఆదేశాలు కూడా ఇస్తుంది. ఇంతా చేసినా కూడా పాపం పెట్రో ఉత్పత్తుల ధరలను నియంత్రించడం తన చేతిలో లేని వ్యవహారం అని చేతి లో చెయ్యేసి మరీ! చెబుతోంది. ఆ విధంగా నవ్య భారత్ లో బీజేపీ చేతిలో లేని విషయాలనే తమ చేతిలోకి తీసుకుని తనదైన పొలిటికల్ మార్క్ పంచెస్ విసురుతోంది హస్తం పార్టీ. ఇది కదా రాజకీయం అంటే!
ఓటు బ్యాంకు సరిగా లేకున్నా కూడా ఓటమి పాలై పరువు పోగొట్టుకున్నా కూడా హస్తం పార్టీ మాత్రం తన స్పీడు అయితే తగ్గించడం లేదు. అందుకు తార్కాణంగా బీజేపీ ఉపయోగించిన కొన్ని ట్రిక్కులను, గతంలో ఆ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఉన్న ప్రశాంత్ కిశోర్ నేర్పిన ట్రిక్కులను తిరిగి అప్లై చేస్తుంది. తిరిగి వారి ముఖానే రుద్దుతోంది.ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంచి హవానే సృష్టిస్తోంది సోషల్ మీడియాలో ! అన్ని విపక్ష పార్టీల కన్నా భిన్నంగా తన పేజ్ ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది ఏపీ కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే జగన్ పై కూడా పొలిటికల్ పంచెస్ విసురుతోంది. ఆ విధంగా కయ్యానికి కాలు దువ్వుతోంది.
ప్రభుత్వ సంస్థలను అమ్మడమేనా మీ పని.. ఏంటీ ఈ మాట బీజేపీ నేతలు అంటున్నారేంటి అని ఆశ్చర్యపోకండి..అదీ సాక్షాత్తూ సోము వీర్రాజు అనే పెద్ద తలకాయ పాల్గొన్న నిరసనలో ఇలాంటి నినాదాలు రావడం ఏంటా అని నివ్వెరపోకండి.. ఏదేమయినా కూడా ఇదంతా కాంగ్రెస్ లేదా ఇంకెవ్వరో చేసిన ఫొటో జిమ్మిక్కు.. ఈ జిమ్మిక్కుల్లో భాగంగా ఓ ఫొటోను పూర్తిగా తమకు అనుగుణంగా మార్చేసి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించారు కొందరు విపక్ష నాయకులు. దీనినే తీసుకువచ్చి ఏపీ కాంగ్రెస్ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్టు చేసి తెగ వైరల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో ఓ మార్ఫింగ్ ఫొటో హల్చల్ చేస్తోంది. దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గు మంటున్న తరుణాన అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్న సందర్భాన కొత్తగా పాలనలో సంస్కరణలేవీ తీసుకు రాని సందర్భాన ఏపీ కాంగ్రెస్ ఇప్పటికే కొన్ని సందర్భాల్లో తీవ్ర స్వరం వినిపిస్తోంది. ఇందుకు ఇలాంటి టెక్నిక్స్ ఉన్న ఫొటోలనూ వాడుకుంటోంది. ఇందులో సోము వీర్రాజు (ప్రస్తుత ఏపీ బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్) ఓ ప్లకార్డు పట్టుకున్న విధంగా అందులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అని రాసి ఉంది.
ఇది ఒక నిరసన శిబిరంలో సోము వీర్రాజుతో పాటు ఇంకొందరు పాల్గొన్న సందర్భంగా తీసిన ఫొటో. దీనిని కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి మార్చేశారు. మరో యువ నేత పట్టుకున్న ప్లకార్డులో రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిలు ధరలు వెంటనే తగ్గించండి మోడీ జీ అని రాశారు. మరో చోట పెంచిన గ్యాస్ రేట్లను తగ్గించండి మోడీ గారూ! అని రాశారు. ఈవిధంగా మొత్తం అందరి నేతల చేతుల్లో ఉన్న ప్లకార్డుల్లోనూ బీజేపీ వ్యతిరేక నినాదాలతో నింపేశారు.