Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు రాముడా? ఏవిధంగా పోలిక‌..? బొత్స కామెంట్స్‌

By:  Tupaki Desk   |   31 March 2022 7:31 AM GMT
చంద్ర‌బాబు రాముడా?  ఏవిధంగా పోలిక‌..?  బొత్స కామెంట్స్‌
X
చంద్రబాబుని రాముడి పేరుతో పోల్చడం చాలా అతిగా ఉందని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. చంద్రబాబు ఏ విధంగా రాముడితో సరిపోతాడు..? సొంత మామకి వెన్నుపోటు పొడిచినందుకా..? అని బొత్స ప్రశ్నించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది వైఎస్ఆర్ అని, చంద్రబాబు కాదని మంత్రి బొత్స చెప్పారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్ ప్రారంభించి నవే అని ఆయన చెప్పారు. ``చంద్రబాబే అన్నీ చేసేస్తే మరి, సొంత కొడుకు నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు?`` అని బొత్స‌ ప్రశ్నించారు.

వైసీపీలో 60 శాతం కంటే ఎక్కువమందే ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల విష‌యంపై ఏపీఈఆర్సీ.. కేవ‌లం సిఫార‌సులు మాత్ర‌మే చేసింద‌ని... దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇక‌, అత్యంత కీల‌కంగా మారిన కేబినెట్ విస్త‌ర‌ణ‌లేదా ప్ర‌క్షాళ‌నపై బొత్స కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. ఈ అంశం పూర్తిగా సీఎం జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని ఆయన చెప్పారు. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకు న్నా గౌరవిస్తామని, అందుకు అనుగుణంగానే సాగుతామ‌ని చెప్పారు. కేబినెట్‌పై నాయ‌కుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, కేబినెట్ కూర్పు అంటే ఎన్నో స‌మీక‌ర‌ణాలు ఉంటాయన్నారు.

పార్టీ బ‌లోపేతం కోసం క‌లిసికట్టుగా ప‌నిచేస్తామ‌న్నారు. సీఎం జ‌గ‌న్ ఎలా చెబితే అలా ముందుకు సాగుతామ‌ని నొక్కి చెప్పారు. ``కేబినెట్ విస్తరణపై జగన్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. అది ఆయన ఇష్టం. పార్టీని బలోపేతం చెయ్యడం, అధికారంలోకి తేవడం తమ అందరి బాధ్యత. 90 శాతం మంది మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము గౌరవిస్తాం`` అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఇదిలావుంటే.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు డేట్‌ ఫిక్స్‌ కావడంతో అటు మంత్రుల్లో.. ఆశావహుల్లో టెన్షన్ పెరగుతోంది. ఏప్రిల్ 7న కేబినెట్‌ భేటీ కానుంది. అదే రోజు మంత్రులకు సీఎం జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఆ తరువాత 8వ తేదీన గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకోనున్నారు సీఎం జగన్. గవర్నర్ ను కలిసి ఆయనకు మంత్రి వర్గ విస్తరణపై సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. ఆ తరువాత 11వ తేదీన కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేస్తారు.

అయితే కొత్త కేబినెట్‌లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారనే దానిపై ఒక రోజు ముందే ఎమ్మెల్యే లకు ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. కొత్త మంత్రివర్గంలో కేవలం ఇద్దరు లేదా.. ముగ్గురు పాత మంత్రలు మాత్రమే ఉంటారని ఇప్పటికే సీఎం జగన్‌ క్లారిటీ ఇచ్చారు. 90 శాతం కొత్త కేబినెట్‌ కొలువుదీరనుంది. మ‌రి ఎవ‌రు ఉంటారు.. ఎవ‌రు మాజీలు అవుతారు..? అనేది ఆస‌క్తిగా మారింది.