Begin typing your search above and press return to search.
జగన్ చేతనే చెప్పించిన తెలుగు తమ్ముడు
By: Tupaki Desk | 21 March 2022 12:33 PM GMTఅందరూ ఒకేలా ఉంటే ఇంకేం. జగన్ లాంటి బలమైన ప్రభుత్వం కొలువు తీరిన వేళ.. అధికార పార్టీ దూకుడుకు కళ్లాలు వేస్తూ.. సాక్ష్యాలు.. ఆధారాలతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి విషయంలో మిగిలిన తెలుగుదేశం పార్టీ నేతలతో పోలిస్తే నిమ్మల రామానాయుడు కాస్త డిఫరెంట్. ఏం మాట్లాడినా సరే.. వైసీపీ నేతలకు టెన్షన్ పుట్టేలా.. చిరాకు తెప్పించేలా చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన మాట్లాడే మాటలకు తరచూ వైసీపీ సర్కారు ఇరుకున పడుతుంటుంది.
అసెంబ్లీలో ఏదైనా ఇష్యూ మీద ఆయన నోరు విప్పితే.. మిగిలిన వారి మాటల మాదిరి.. సింఫుల్ గా తీసుకోకుండా జాగ్రత్తగా మాట్లాడటం కనిపిస్తుంటుంది. గతంలో నిమ్మలను లైట్ తీసుకున్న వారికి ఎదురుదెబ్బలు తగిలిన పరిస్థితి. అందుకే.. ఆయన నోట్లో నుంచి మాట ఏదైనా వచ్చిందంటే.. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడాల్సిందే. లేదంటే.. చివరకు ఏదోలా తమ తప్పును ఒప్పుకోవాల్సిందే. దీనికి కారణం.. విషయాల మీద అవగాహన.. లోతుగా పరిశీలించటం లాంటివి.
తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సీఎం జగన్ చేత.. సాక్షి పత్రికలో తప్పులు రాస్తారన్న మాటను అసెంబ్లీలో చెప్పించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిమ్మల రామానాయుడ్ని అసెంబ్లీలో సస్పెండ్ చేసినన్ని సార్లు మరే టీడీపీ నేతను సస్పెండ్ చేయలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకలా అని ప్రశ్నిస్తే.. ‘‘శాసన సభలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడాన్ని అధికారపక్షం సహించలేక పోతోంది. నేను ఏం మాట్లాడినా.. ఆధారాలతోనే మాట్లాడతాను. ఈ నేపథ్యంలోనే నేను సాక్ష్యాలు, ఆధారాలు చూపించి అసెంబ్లీలో ప్రశ్నించేసరికి.. వాళ్లు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎదురుదాడి చేయడం సహజంగా మారిపోయింది’’ అని చెప్పారు.
ఒకసారి సీఎం జగన్ కూడా ఆత్మరక్షణలో పడిన పరిస్థితి గురించి చెబుతూ.. ‘‘అసెంబ్లీ తొలి సమావేశంలో.. గోదావరి నీటిని తెలంగాణ భూభాగం మీదుగా తీసుకువెళ్తామని సీఎం జగన్ చెప్పినప్పుడు.. నేను మాట్లాడుతూ.. మీరు ప్రతిపక్షంలో ఉంటే.. పోరాటం అంటారు. అదే అధికారంలోకి వస్తే లాలూచీ అంటా రా? అని ప్రశ్నించా. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 48 గంటలు జగన్మోహన్‌రెడ్డి జలదీక్ష చేశారు. కానీ, తర్వాత ఆయనే కాళేశ్వరం ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టారు. రిబ్బన్ కట్ చేశారు. ఇలా.. అన్ని సాక్ష్యాలతో నేను మాట్లాడే సరికి నాపై వారికి కోపం వచ్చింది’ అని చెప్పారు.
మరో సందర్భంలో సాక్షి దినపత్రికల్లో తప్పులు రాస్తారంటూ జగన్ చేత చెప్పించిన క్రెడిట్ నిమ్మలకే దక్కుతుంది. దాని గురించి చెబుతూ.. ‘‘ఒకసారి సన్నబియ్యం గురించి మాట్లాడాను. అయితే.. జగన్ మాత్రం అసలు ఆవిషయం తనకు తెలియదని చెప్పారు. దీంతో ఆయన సొంత పత్రికే తీసి చూపించాను. ‘‘ఇదేదో ఆంధ్రజ్యోతికాదు, ఈనాడు కాదు.. మీ పేపరే.. మీ సాక్షే!’’ అని చెప్పేసరికి.. సాక్షిలో ఒక్కొక్కసారి తప్పులు రాస్తారంటూ.. ఆయనే ఒప్పుకొన్నారు. ఇలా.. సాక్షి పేపర్‌లో తప్పులు రాస్తారని ఆయన నోటితోనే చెప్పించా!’’ అని పేర్కొన్నారు. ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో నిమ్మల రూటు సపరేటు అని చెప్పక తప్పదు.