Begin typing your search above and press return to search.
అలీకి జాక్ పాట్...ఆ సీటు కన్ఫర్మ్...?
By: Tupaki Desk | 31 March 2022 12:31 PM GMTటాలీవుడ్ కమెడియన్ అలీకి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభలో మైనారిటీ కోటాను ఈసారి భర్తీ చేయాలని వైసీపీ సీరియస్ గా ఆలోచిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు మరోసారి రాజ్యసభ సీట్లను భర్తీ చేసే చాన్స్ లేదు. దాంతో అన్ని సామాజికవర్గాలకూ పెద్దల సభలో చోటు కల్పించామన్నది గట్టిగా వైసీపీ చెప్పుకోవాలనుకుంటోంది.
ఈ నేపధ్యంలో అలీకి రాజ్యసభ పదవి దక్కనుంది అంటున్నారు. ఈ మధ్యనే అలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలసి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఏ పదవి ఇచ్చినా చేస్తాను అని అన్నారు. అయితే తనకు ఏ పదవీ ఇస్తానని సీఎం చెప్పలేదని, ఒకవేళ పదవి ఇస్తే అది మీడియాకే ముందు తెలుస్తుంది అని కూడా ఆయన చెప్పుకున్నారు.
అయితే జగన్ మాత్రం అలీకి రాజ్యసభ హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీల పదవులను భర్తీ చేసేశారు. ఇక మిగిలింది పెద్దల సభకు మాత్రమే. దాంతో అలీకి అన్ని రకాలుగా అనుకూలంగా పరిస్థితి ఉంది అంటున్నారు. అలీని వచ్చే ఎన్నికలలో ప్రచారానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వైసీపీకి ఉంది.
గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన అలీ అప్పట్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈసారి కూడా అలీ సేవలను వాడుకుంటూనే ఆయన ద్వారా సినీ రంగానికి చెందిన మరింతమందిని ఆకట్టుకోవాలన్న ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. మరో వైపు చూస్తే అలీతో పాటు రాజ్యసభకు రెండవసారి విజయసాయిరెడ్డిని పంపనున్నారు. అలాగే ఒక సీటు బీసీలకు, మరో సీటు గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజికవర్గం నేత మర్రి రాజశేఖర్ కి ఇవ్వాలని జగన్ నిర్ణయించారని తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే రాజ్యసభకు ఎంపిక అయ్యే నలుగురు అభ్యర్ధుల పేర్లను ఖరారు చేశారని అంటున్నారు. ఎపుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అపుడు వీరి పేర్లు ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు. సో అలీకి జాక్ పాట్ తగిలినట్లే అన్నది వైసీపీలో మాటగా ఉంది.