Begin typing your search above and press return to search.

వామ్మో : శిలాఫలకానికి సెక్యూరిటీ ? ఓవర్ టు దువ్వాడ

By:  Tupaki Desk   |   7 April 2022 7:47 AM GMT
వామ్మో : శిలాఫలకానికి సెక్యూరిటీ ? ఓవర్ టు దువ్వాడ
X
మీరు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఇదే నిజం. ఆ ఊళ్లో శిలాఫ‌ల‌కానికి పోలీసులు కంటి మీద కునుకు అన్న‌ది రానివ్వ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు. ఇదివ‌ర‌కే ఆరంభం అయిన టెక్క‌లి ఆస్ప‌త్రిని మ‌ళ్లీ ఆరంభించి శ్రీ‌కాకుళం రాజ‌కీయాలలో మ‌రో చ‌రిత్ర‌కు తావిచ్చిన వైనంపై దువ్వాడ‌ను విమ‌ర్శిస్తూ ఉద్దేశిస్తూ అచ్చెన్న వ‌ర్గం మండిప‌డుతోంది. దీంతో ఎప్ప‌టి నుంచో ఉన్న వైరం కాస్త రాజుకుంది.

దువ్వాడ శ్రీ‌నివాస్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌కుండా తానొక ఎమ్మెల్యే అన్న విష‌యం కూడా మ‌రిచిపోయి ప్ర‌వ‌ర్తించి తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు తావిచ్చింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఏ క్ష‌ణం అయినా కొట్లాట జ‌రిగే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. పుష్క‌లంగా ఉన్నాయి అని రాయాలి. అచ్చెన్న కూడా శిలాఫ‌ల‌కం వివాదాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు. తాను తీసుకువ‌చ్చిన ఆస్ప‌త్రికి అద‌న‌పు వ‌స‌తులు లేదా సౌక‌ర్యాలు క‌ల్పించినంత మాత్రాన మ‌ళ్లీ ప్రారంభం పేరిట డ్రామా న‌డ‌ప‌డం ఏంటి అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

శ్రీ‌కాకుళం జిల్లా, టెక్కిలి నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్రిక్త వాతావ‌రణం నిన్న‌టి వేళ నెల‌కొంది. వాస్త‌వానికి గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ రాజకీయ ప‌రిణామాలు సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేస్తున్నాయి. దీంతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. నియోజ‌క‌వర్గ కేంద్రంలో అప్ప‌ట్లో అచ్చెన్న నేతృత్వంలో జిల్లా కేంద్రాస్పత్రి ఏర్పాటు కావ‌డం దాని శిలాఫ‌ల‌కంను ఆవిష్క‌రించ‌డం జ‌రిగాయి. కానీ ఇదే శిలాఫ‌లకాన్ని మొన్న కొంద‌రు ఛిద్రం చేశారు.

దీనిపై ఎమ్మెల్సీ దువ్వాడ నిన్న జ‌రిగిన సభ‌లో నేరుగా తామే ఆ ప‌ని చేశామ‌ని చెప్పారు. య‌థావిధిగా త‌న‌కూ కింజ‌రాపు కుటుంబానికీ ఉన్న వివాదం గురించి చెప్పారు. దీంతో అక్క‌డ మ‌ళ్లీ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. సాక్షాత్తూ క‌లెక్ట‌ర్ ఎదురుగా తామే ఆ ప‌ని చేశామ‌ని చెబుతూ బ‌హిరంగ స‌వాల్ విసిరి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు.

ఆ స‌మ‌యంలో డిప్యూటీ సీఎం దాస‌న్న క‌లుగ‌జేసుకుని వ‌ద్ద‌ని వారించ‌డంతో ఆగిపోయారు. ఇవ‌న్నీ ప్ర‌ధాన మీడియాలో వెలుగు చూసిన నిజాలే! అయితే నిన్న‌టి వేళ మ‌ళ్లీ జిల్లా కేంద్రాస్ప‌త్రి ఆరంభం అంటూ వైసీపీ డ్రామా న‌డిపించింద‌ని టీడీపీ మండిప‌డుతోంది. ఎప్పుడో త‌మ హ‌యాంలో తెచ్చిన ఆస్ప‌త్రికి మీరెలా పేర్లు వేసుకుంటార‌ని అచ్చెన్న వ‌ర్గం ఫైర్ అవుతోంది. దీంతో ఇంకాస్త గొడ‌వ పెద్ద‌ది అయింది. ఆఖ‌రికి శిలాఫ‌ల‌కాన్ని మంత్రి దాస‌న్న ఆవిష్క‌రించాక లోప‌లికి తీసుకుని వెళ్లి దాచారు.దీనికి పోలీసులు ర‌క్ష‌ణ ఇచ్చారు.