Begin typing your search above and press return to search.
ఏపీ రాజకీయాల్లో 'గాలి'.. కేబినెట్ కూర్పులో ముద్రలు?
By: Tupaki Desk | 7 April 2022 6:30 AM GMTరెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎలాంటి పాత్ర పోషించని గాలి జనార్ధన్ రెడ్డి అంటే తెలియని వారంటూ ఉండరు. ఒబుళాపురం గనుల ఎపిసోడ్.. బళ్లారి రాజకీయాల్లో గాలి వారి హవా ఎంతన్న విషయం తెలిసిందే. బీజేపీ లాంటి పార్టీకే ఉక్కుబోతకు గురి చేసిన ఆయన.. ఆ మధ్యన సీబీఐ దెబ్బతో విలవిలలాడిపోయారు. నాటి దెబ్బ తాలుకూ ప్రభావం నేటికి ఆయన మీద ఉందని చెబుతారు.
ఇటీవల కాలంలో వార్తల్లో పెద్దగా కనిపించని ఆయన.. తాజాగా మాత్రం ఆయన పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన.. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఆయన ముద్రలు కనిపిస్తున్నాయా? జగన్ సిద్ధం చేస్తున్న తాజా కేబినెట్ కూర్పులో తనవాళ్లకు చోటు కల్పించేందుకు వీలుగా జగన్ ను ఒప్పించేందుకు వీలుగా గాలి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి వాటికి జగన్ ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగామారింది.
తనకు సన్నిహితులుగా ఉన్న నేతల తరఫున వకల్తా పుచ్చుకొని జగన్ దగ్గర తన విష్ లిస్టు పెట్టినట్లుగా చెబుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మానూరు జయరాం గాలికి చాలా సన్నిహితుడు. పాత మంత్రుల్ని పక్కన పెట్టేసి.. కొత్త వాళ్లతో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ కు.. జయరాంను కొనసాగించేలా చేయాలన్న మాట చెప్పే ప్రయత్నం చేశారంటున్నారు. గాలి ద్వారా చక్రం తిప్పుతున్న జయరాం పదవి ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.
జయరాం మాత్రమే కాదు.. అనంతపురం జిల్లాకు చెందిన మరో మంత్రి సైతం ‘గాలి’ ద్వారా ప్రయత్నాలు షురూ చేసినట్లుగా చెబుతున్నారు. కొత్త కేబినెట్ కొలువు తీరేందుకు ముహుర్తం ఖరారైన నేపథ్యంలో ఏపీ మంత్రులు విజయవాడ నుంచి తట్టాబుట్టా సర్దుకోవటం.. రాజీనామాలు కోరటానికి ముందే పదవీ త్యాగానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని చెప్పేందుకు వీలుగా వారి చర్య ఉందంటున్నారు. క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయటంతో పాటు.. తమ పేషీలోని సిబ్బందిని సైతం వారు కోరుకున్న చోటుకు బదిలీ చేసేలా సిఫార్సులు చేసిన తీరు చూస్తే.. కొత్త మంత్రివర్గంలో నలుగురైదుగురు మినహా మిగిలిన వారందరికి ఉద్వాసన తప్పదన్నది ఖాయమంటున్నారు.
చాలా రోజుల తర్వాత ‘గాలి’ మాట ఏపీ రాజకీయాల్లో వినిపించటం.. అది కూడా జగన్ ను ప్రభావితం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అన్నది తేలాలంటే ఈ నెల 11 వరకు వెయిట్ చేయాల్సిందేనని చెప్పక తప్పదు. ఏమైనా ‘గాలి’ చర్చ ఏపీ అధికారపక్షంలో హాట్ టాపిక్ గా మారింది.