Begin typing your search above and press return to search.

లగేజ్ బ్యాగ్ కోసం ఎయిర్ లైన్స్ సైట్ ను హ్యాక్ చేశాడు

By:  Tupaki Desk   |   31 March 2022 5:30 PM GMT
లగేజ్ బ్యాగ్ కోసం ఎయిర్ లైన్స్ సైట్ ను హ్యాక్ చేశాడు
X
పాట్నా నుంచి బెంగళూరు వచ్చిన ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికుల లగేజీ బ్యాగులు సేమ్ టు సేమ్ ఉన్నాయి. అయితే వారిద్దరూ ఆ బ్యాగుల్లో ఎవరిది ఏ బ్యాగో గుర్తించ లేక చాలా ఇబ్బంది పడ్డారు. అయితే అందులో నుండి తమ బ్యాగ్ ఏదో వెతికి తీసుకునేందుకు కస్టమర్ కేర్ వారు కూడా సాయం చేయలేదు. చాలా సేపు వేచి చూసినా అధికారులు స్పందించకపోవడంతో... ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి తన సాఫ్ట్ వేర్ నైపుణ్యాన్ని ఉపయోగించాడు. తన బ్యాగును తాను తీసుకొని, అచ్చం అలాంటి మరో బ్యాగుని తన తోటి ప్రయాణికుడికి అప్పగించాడు.

ఇక్కడితో సమస్య తీరిపోయింది కదా మరి ఇంకేంటి అనుకుంటున్నారా... అసలు గొడవంతా ఇక్కడే మొదలైందండి.ఇండిగోకు మంచి సలహాలు కూడా ఇచ్చారు. ఇటువంటి అసౌకర్యం కలిగినందుకు ఎయిర్లైన్స్ విచారం వ్యక్తం చేస్తూ, లోపాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చింది.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నందన్ కుమార్ ట్విటర్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం... ఆయన మార్చి 27న ఇండిగో 6ఈ-185 విమానంలో పాట్నా నుంచి బెంగళూరు వెళ్ళారు. ఆయన లగేజీని పొరపాటున మరో ప్రయాణికుడు తీసుకెళ్ళారు. సహ ప్రయాణికుడి లగేజీని నందన్ తీసుకొచ్చారు. ఈ విధంగా బ్యాగులు మారడంలో ఇరువురి పొరపాటు లేదు. ఆ రెండు బ్యాగులు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఇలా జరిగింది.

ఇంటికి వెళ్ళిన తర్వాత నందన్ కుమార్ భార్య ఆ బ్యాగును బాగా పరిశీలించి ఇది మన బ్యాగు కాదని చెప్పారు. మనం తాళం వాడం కదా అని ఆమె నందన్ కుమార్ తో అనడంతో... జరిగిన పొరపాటును గుర్తించాడు నందన్ కుమార్. అనంతరం ఆయన ఇండిగో కస్టమర్ కేర్ ను సంప్రదించారు. ఒక రోజు వేచి చూసినప్పటికీ కస్టమర్ కేర్ నుంచి సరైన సమాధానం రాలేదు. తన బ్యాగును పట్టుకెళ్లిన వ్యక్తికి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి ముందుకు రాలేదు. వ్యక్తి గత గోప్యత, డేటా ప్రొటెక్షన్ అంటూ సాకులు చెప్పారు.

ఆ మర్నాడు కూడా కస్టమర్ కేర్ నుంచి ఫోన్ రాలేదు. అయితే ఏజెంట్ మాత్రం ఓ హామీ ఇచ్చారు. ఆ బ్యాగును పట్టు కెళ్ళిన వ్యక్తి సమాచారం దొరికిన వెంటనే ఫోన్ చేస్తామని చెప్పారు. కానీ కస్టమర్ కేర్ నుండి నందన్ కుమార్ కు ఎంతకీ ఫోన్ రాలేదు. ఇంకెన్ని రోజులు వేచి చూడాలనుకున్నాడు. ఇండిగో సంస్థ బాధ్యతారాహిత్యానికి నందన్ కు అసంతృప్తి చెందాడు. తన బ్యాగ్ ఎలాగైన కనుక్కోవాలని అనుకున్నాడు. తన సాఫ్ట్ వేర్ నైపుణ్యంతో దీనికి పరిష్కారం కనిపెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు నందన్ కుమార్.

ఇండిగో వెబ్ సైట్ ను తెరిచి F12 ను నొక్కి, చెక్-ఇన్ ఫ్లోను, నెట్ వర్క్ లాగ్ రికార్డు ను చూశారు. కావలసిన సమాచారం సేకరించారు. తన బ్యాగును పట్టు కెళ్ళిన సహ ప్రయాణికుడి పీఎన్ఆర్ నంబరు తాను తీసుకొచ్చిన బ్యాగుపై ఉండటంతో దాని ఆధారంగా కొంత ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆ సహ ప్రయాణికుడి సమాచారం, ఫోన్ నెంబర్ తెలుసుకున్నారు. అదృష్టవశాత్తూ వీరిద్దరూ దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం లోనే ఉన్నారు. తాను తీసుకొచ్చిన బ్యాగును ఆయనకు ఇచ్చేసి, తన బ్యాగును తాను తిరిగి తీసుకున్నారు.

తన బ్యాగును తను తెచ్చుకున్న నందన్ అంతటితో ఊరుకోలేదు. ఇండిగో ఎయిర్ లైన్స్ కు కొన్ని సూచనలు చేశాడు. IVRను ఫిక్స్ చేసుకోవాలని, మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని తెలిపారు. కస్టమర్ కేర్ సేవలు చురుగ్గా ఉండేలా చూడాలని, రియాక్టివ్ ఉండేలా చేయవద్దని చెప్పారు. సున్నితమైన సమాచారాన్ని ఈ వెబ్ సైట్ లీక్ చేస్తోందని దీనిని సరిదిద్దాలని సూచించారు.

దీనిపై ఇండిగో స్పందిస్తూ, నందన్ కుమార్ కు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. సెక్యూరిటీ లోపాలు లేకుండా జాగ్రత్ తవహిస్తామని హామీ ఇచ్చింది.