Begin typing your search above and press return to search.

జగన్ వీర భక్తుడికి షాక్.. మంత్రి టెన్షన్ కు తాజా జీవోతో తెర దించారు

By:  Tupaki Desk   |   10 April 2022 4:09 AM GMT
జగన్ వీర భక్తుడికి షాక్.. మంత్రి టెన్షన్ కు తాజా జీవోతో తెర దించారు
X
వీరాభిమానులకు మిగిలేదేంటి? తామెంతో అభిమానాన్ని చూపించి.. ఆరాధించే వారు తమకు హ్యాండివ్వటం కామన్ అనే విషయం మరోసారి తేలిపోయింది. రాజకీయాల్లో ఏమున్నా లేకున్నా వీర విధేయతతో కలిసి వస్తుందని చెబుతారు. కానీ.. కొందరి విషయంలో మాత్రం అదే వారి పాలిట శాపంగా మారుతుంటుంది. తాజాగా అలాంటి షాకే తగిలింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీర భక్తుడు కమ్ తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి వైఎస్ అన్నా.. ఆయన కుటుంబమన్నా ఎంతటి కమిట్ మెంటో.. మరెంతటి అభిమానమన్న విషయాన్ని తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ నిరూపించుకున్నారని చెప్పాలి. అలాంటి చెవిరెడ్డికి తాజాగా జరుగుతున్న కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఖాయంగా చోటు దక్కుతుందన్న మాట వినిపించింది. అయితే.. అలాంటి ఛాన్సులేమీ లేవన్న విషయాన్ని తాజాగా విడుదలైన జీవో స్పష్టం చేసింది.

సోమవారం కొలువు తీరే వైఎస్ జగన్ మంత్రివర్గం 2.0లో చెవిరెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం సాగింది. ఇలాంటి వేళలో.. తన పేరుతో మంత్రి పదవి ఖాయమని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆయనకు శనివారం రాత్రి వేళలో.. ఒక జీవో జారీ అయ్యింది. దాని సారాంశం ఏమంటే.. సీఎం జగనన్ ను వీరాభిమానంతో అభిమానించే చెవిరెడ్డి మాష్టారిని తుడా ఛైర్మన్ గా మరో రెండేళ్ల పాటు కంటిన్యూ చేస్తున్నట్లుగా తేల్చారు.

దీంతో.. కొత్త మంత్రి వర్గంలో చెవిరెడ్డికి అవకాశం లేదని తేలిపోయింది. తొలుత అనుకున్నట్లుగా కొత్త మంత్రివర్గంలో ఐదారుగురు తప్పించి అంతా కొత్తవారే ఉంటారన్న మాట వినిపించినా.. అలాంటిదేమీ లేదని జగన్ మీద ఉన్న ఒత్తిడితో పాత-కొత్త కాంబినేషన్ లో సరిసమానంగా కేబినెట్ కూర్పు ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన చూసినప్పుడు ప్రస్తుతం జగన్ కొత్త జట్టులో పాత.. కొత్త వారు ఉండటమే ఆయన వీర భక్తులకు షాకులు తగిలేలా చేస్తున్నాయని చెబుతున్నారు.

అందరిని సర్దుబాటు చేయటం సాధ్యం కాని నేపథ్యంలో.. ఇప్పటికే పదవుల్లో ఉన్న వారిని.. అదే పదవుల్లో కంటిన్యూ అయ్యేలా కొనసాగింపు ఇవ్వటంతో.. మంత్రి వర్గం ఎలా ఉంటుందన్న విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. తాను త్వరలో మంత్రిని కాబోతున్నానని ఆశ పడిన చెవిరెడ్డికి అలాంటిదేమీ ఉండదన్న విషయం తాజా జీవోతో స్పష్టమైందని చెప్పాలి.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. మంత్రిని అవుతానని కలలు కనే వారి ఆశలపై పరదాలు కప్పేస్తూ.. రెండు రోజుల ముందే మంత్రి పదవి రాదని తేల్చి చెప్పేసిన వైనానికి మాత్రం చెవిరెడ్డి అంతో ఇంతో ఆనందం కలుగక మానదు. చివరివరకు ఊరించే కన్నా.. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తేల్చేస్తే ఎవరికి మాత్రం ఆనందం కలుగదు. అందులోకి చెవిరెడ్డి లాంటి జగన్ వీర భక్తుడికి ఆ మాత్రం ఉండదంటారా?