Begin typing your search above and press return to search.

మేకతోటి తన పరిమితులు దాటేశారా?

By:  Tupaki Desk   |   13 April 2022 4:49 AM GMT
మేకతోటి తన పరిమితులు దాటేశారా?
X
మాజీమంత్రి మేకతోటి సుచరిత చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది. తాజా మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవటంపై ఆమె అలిగారు. అలగటం వరకు అయితే ఓకేనే కానీ ఏకంగా ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మంత్రివర్గంలోని ఐదుగురు ఎస్సీల్లో నలుగురిని మళ్ళీ తాజా కేబినెట్ లోకి తీసుకుని తనను మాత్రం జగన్మోహన్ రెడ్డి డ్రాప్ చేయటంపై ఆమె మండిపోతున్నారు. ఆ కోపాన్ని రాజీనామా చేయటం ద్వారా మేకతోటి చూపించారు.

అలిగిన, ఆగ్రహంతో ఉన్న మేకతోటిని సముదాయించటానికి వచ్చిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణతో కూడా సరిగా మాట్లాడలేదు. పైగా నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా రాజీనామా పత్రాన్ని అందించారు. రాజీనామా పత్రాన్ని తీసుకుని మోపిదేవి వెళ్ళిపోయారు. తర్వాత మాట్లాడుకుందాం రమ్మని సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుండి ఫోన్ వచ్చినా అనారోగ్యం సాకుతో వెళ్ళలేదు. ఇదంతా చూసిన జగన్మోహన్ రెడ్డికి బాగా చిరాకేసినట్లుంది.

అందుకనే మేకతోటితో మాట్లాడేందుకు జగన్ సానుకూలత చూపలేదు. అసంతృప్తితో ఉన్న పిన్నెల్లి, సామినేని, కరణం, బాలినేనితో మాట్లాడిన జగన్ మాజీ హోంశాఖ మంత్రితో మాత్రం మాట్లాడలేదు. ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తే నష్టపోయేది తానే కానీ జగన్ కాదని మేకతోటి ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. మంత్రివర్గంలోకి తీసుకున్నపుడు తీసుకున్నారు డ్రాప్ చేయాల్సొచ్చినపుడు డ్రాప్ చేశారంతే. మేకతోటినీ మంత్రివర్గంలోకి తీసుకున్నపుడు ఎవరో ఒకరు బాధపడుంటారు కదా.

క్యాబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి ? ఎవరిని పక్కన పెట్టాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం. అనేక అవసరాలను, కాంబినేషన్లను చూసుకున్న తర్వాతే క్యాబినెట్ ఏర్పాటు చేస్తారు. క్యాబినెట్లోకి తీసుకోగలిగింది మ్యాగ్జిమమ్ 25 మందిని మాత్రమే. మరి మిగిలిన 125 మంది ఎంఎల్ఏలను ఏమి చేయాలి ? ఇంత చిన్న విషయాన్ని కూడా మేకతోటి గ్రహించలేక ఓవర్ యాక్షన్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. చెల్లెలని జగన్ నెత్తిన పెట్టుకున్నందుకు మేకతోటి నిజస్వరూపాన్ని చూపించిందని పార్టీలో టాక్ మొదలైంది.