Begin typing your search above and press return to search.

బిగ్ టర్న్ - తూచ్ నేను రాజీనామా చేయలేదు

By:  Tupaki Desk   |   14 April 2022 4:28 AM GMT
బిగ్ టర్న్ - తూచ్ నేను రాజీనామా చేయలేదు
X
మాజీ మంత్రి మేకతోటి సుచరిత డ్యామేజ్ కంట్రోలుకు నానా అవస్థలు పడ్డారు. కొత్త మంత్రివర్గంలో తన పేరు లేకపోవటంతో జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం వాస్తవం. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అలిగి ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిందీ వాస్తవమే. అయితే అదంతా జగన్ ముందుకు నెగిటివ్ గా వెళ్ళింది. దాంతో మండిపోయిన జగన్ మాజీ మంత్రికి అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు.

ఇదే విషయమై అలిగిన మరో నలుగురు ఎంఎల్ఏల తో మాట్లాడిన జగన్ మాజీ మంత్రి తో మాట్లాడటానికి మాత్రం ఇష్టపడలేదు. దాంతో జగన్ తో గ్యాప్ పెరిగితే జరిగే డ్యామేజి ఏమిటో మేకతోటికి బాగా అర్ధమైపోయినట్లుంది.

అందుకనే ఏదో విధంగా మాట్లాడుకుని అపాయిట్మెంట్ తీసుకుని వెళ్ళి గంటసేపు మాట్లాడారు. లోపల వన్ టు వన్ ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి తానసలు రాజీనామాయే చేయలేదనటమే ఆశ్చర్యంగా ఉంది.

మేకతోటి రాజీనామా చేసినట్లు, రాజీనామా పత్రాన్ని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కు ఇచ్చినట్లు స్వయంగా మాజీ మంత్రి కూతురే మీడియా తో చెప్పింది. స్వయంగా కూతురే ప్రకటించింది కాబట్టి మీడియా కూడా దాన్నే హైలైట్ చేసింది. ఇందులో తప్పంటు ఉంటే అది మేకతోటిదే కానీ మీడియాది ఎంత మాత్రం కాదు.

మేకతోటి చెప్పమనకుండానే ఆమె కూతురు మీడియా లో చెబుతుందా ? రాజీనామా చేసినట్లు మీడియాలో రాగానే జగన్ దిగొస్తారని బహుశా మేకతోటి అంచనా వేశారేమో. అయితే తన అంచనా తప్పయిందని తెలిసి పోయింది.

పైగా తన కూతురు చిన్నపిల్లని రాజకీయాలు ఏమీ తెలీవని కూతురును వెనకేసుకొచ్చింది మాజీ మంత్రి. అంటే జరిగిన డ్యామేజీని ఎలా కంట్రోల్ చేయాలో మేకతోటికి అర్ధం కావటం లేదని అందరికీ అర్థమైపోతోంది. అందుకే వేరే దారి లేక సజ్జలనో లేకపోతే మరొకరి ద్వారానే మొత్తానికి అపాయిట్మెంట్ సంపాదించి జగన్ను కలిశారు. లోపల ఏమి మాట్లాడారో తెలీదు కానీ బయటకు వచ్చి పెద్ద కలరింగే ఇచ్చారు. ముందు ఓవర్ యాక్షన్ చేయటం ఎందుకు ? చేతులు కాలిన తర్వాత కవరింగ్ ఎందుకు ?