Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాల లెక్కలు... భూముల ధరలకు రెక్కలు...?
By: Tupaki Desk | 5 April 2022 5:32 AM GMTఅభివృద్ధి అంటే అర్ధాలు మారిపోతున్నాయి. గతంలో ఒక రోడ్డు వేసి దాన్ని ప్రగతి అనేవారు. ఒక బిల్డింగ్ కట్టి పది కాలాల పాటు నిలిచిపోయే సంపదగా చెప్పేవారు. మౌలిక సదుపాయాల కల్పనతో ప్రజల ఆదాయాలను పెంచి అసలైన అభివృద్ధి ఏంటో చాటి చెప్పేవారు. ఇపుడు చూస్తే అభివృద్ధికి అర్ధాలు మారిపోతున్నాయి. ఏకంగా దేవతా వస్త్రాల కధ టైప్ లో ఏమీ లేకుండానే అన్నీ చేశామని అంటున్నారు.
అరచేతిలో వైకుంఠం చూపిస్తూ భ్రమలలో ముంచెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా విభజన ఏపీలో చూసుకుంటే అమరావతి రాజధాని అయినా ఇపుడు ప్రకటించిన కొత్త జిల్లాలు అయినా అభివృద్ధి కంటే కూడా హైప్ క్రియేట్ చేయడమే ఎక్కువ అయిపోతోంది.
నిజానికి అభివృద్ధి అన్నది ఒక క్రమపద్ధతిలో జరగాలి. దానికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఉండాలి. అమరావతి రాజధానిని డిజైన్లు చేసి చూపించి అక్కడ ఎకరం యాభై కోట్లు అని నాడు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే అదేమీ జరగలేదు కానీ మిగిలిన వారికి కంటగింపు అయి ఈ రోజు అమరావతి కధ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇపుడు కొత్త జిల్లాల విషయానికి వస్తే దాన్ని గొప్ప సంస్కరణ అంటున్నారు.
పాలనాపరంగా వికేంద్రీకరణ అని అంటున్నారు. కానీ దీని వల్ల జనాలకు ఏమి ఒరిగింది అంటే లేదు అనే చెప్పాలి. జిల్లాలను చిన్నవిగా చేస్తే నలభై కిలోమీటర్లలో ఉండే కలెక్టరేట్ ఇరవై కిలోమీటర్లకు రావచ్చు. అంత మాత్రాన సగటు ప్రజలకు ఏంటి లాభం. వారికి కావాల్సింది అభివృద్ధి. ముందే చెప్పుకున్నట్లుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం. ఆ విధంగా చేస్తే ఆ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఇక కొత్త జిల్లాల విషయంలో చూస్తే రిజిస్ట్రేషన్ విభాగానికే ఆదాయం తెచ్చేలా సీన్ కనిపిస్తోంది. రేపో మాపో రిలీజ్ అయ్యే భూముల విలువను సవరించే ఉత్తర్వుల మూలంగా జిల్లా కేంద్రాల పరిధిలో పెద్ద ఎత్తున అంటే ముప్పయి నుంచి నలభై శాతం దాకా భూముల ధరలు పెరుగుతాయి. ఆ విధంగా సర్కార్ ఖజానాకు ఆదాయం వస్తుంది.
అదే టైం లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూడా ఇది అనుకూలిస్తుంది. మరి కొత్త జిల్లా మా ప్రాంతానికి వచ్చింది. కలెక్టర్ గారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకునే జనాలకు ఏమిటి ఒరిగింది అన్నదే చూడాలి. ఇక ఒకప్పుడు పట్నాలలో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని పల్లెటూర్లకు ఒక మాదిరి పట్టణాలకు జనాలు వెళ్ళేవారు.
ఇపుడు కొత్త జిల్లాల పేరిట వాటికి కూడా డిమాండ్ వచ్చి పడిపోయింది. దాంతో అద్దెల మోత మధ్యతరగతికి పెరుగుతోంది. ఇక సొంతింటి వారికి ఆస్తి పన్ను కూడా అదే తీరున పెరుగుతుంది. అలా వారికి వడ్డింపు ఉంటుంది. ఇలా వివిధ రూపాలలో వసూలు అయ్యే పన్నులు అన్నీ కూడా కొత్త ఆదాయాలుగా ప్రభుత్వానికి ఉంటాయి. ఈ విధంగా ఆలోచిస్తే కొత్త జిల్లాల మోజు కొన్ని రోజుల సంబరంగానే ప్రజలకు మిగులుతుంది అంటున్నారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి చేయాలీ అంటే రహదారుల రూపురేఖలను మార్చడం, కనెక్టిటీని పెంచడం, అన్ని రకాల ప్రధాన సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రగతి దారులను వెతకాలి. అపుడే ప్రజలకు నిజమైన మేలు జరుగుతుంది. లేకపోతే కాంగ్రెస్ నాయకుడు తులసీరెడ్డి చెప్పినట్లుగా 13ను 26 చేసి అభివృద్ధి అని గొప్పలు చెప్పుకున్నట్లుగానే ఉంటుంది మరి.