Begin typing your search above and press return to search.

ఆయన మినిస్టర్ గుడివాడ....అంతే..?

By:  Tupaki Desk   |   10 April 2022 6:47 AM GMT
ఆయన  మినిస్టర్ గుడివాడ....అంతే..?
X
కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ మినిస్టర్ అవుతున్నారు. ఈ విషయంలో నో డౌట్. ఎందుకంటే గుడివాడ అంటే జగన్ కి ప్రత్యేకమైన అభిమానం. ఆయనకు విపక్షంలో ఉన్నపుడు కూడా ఎన్నో కీలకమైన పార్టీ పదవులు ఇచ్చారు జగన్.

మూడున్నర పదుల వయసు ఉన్న గుడివాడది రాజకీయ కుటుంబం. తండ్రి గుడివాడ గురునాధరావు కూడా మూడు దశాబ్దాల నాడు మంత్రిగా పనిచేశారు. తాత గుడివాడ అప్పన్న ఎమ్మెల్యేగా చేసారు. ఆ వారసత్వాన్ని నిలబెడుతూ గురునాధరావు మూడవతరంలో ధీటైన రాజకీయం చేస్తున్నారు.

మాటలను తూటాలుగా పేల్చడమే కాదు, ప్రత్యర్ధులను చీల్చిచెండాడడంలో గుడివాడ స్టైలే వేరు. పైగా బలమైన సామాజికవర్గానికి చెందిన గుడివాడకు ఎంతో భవిష్యత్తు ఉంది. జగన్ ఏరి కోరి అందుకే తమ టీమ్ లో పెట్టుకుంటున్నారు. ఇక గుడివాడను మంత్రి కానీయరాదని స్వపక్షంలో ఎంతో గడబిడ జరిగింది.

సడెన్ గా అక్రమ క్వారీల ఇష్యూని తెర మీదకు తెచ్చారు. రాజకీయ పలుకుబడితోనే ఆయన వీటిని దక్కించుకున్నారని
తెగ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇవేమీ జగన్ ఎదుట పనిచేయడం లేదు అని తేలిపోతోంది. మంచి మాటకారి, ఉన్నత విద్యావంతుడు అయిన గుడివాడ ఆరు నూరు అయినా అమాత్యుడు కావడం తధ్యమని గట్టిగా వినిపిస్తున్న మాట. సో స్వపక్షం విపక్షం నోళ్ళు రేపు ప్రమాణ స్వీకారం తరువాత మూత పడడం ఖాయమని ఆయన అనుచరులు బల్లగుద్దుతున్నారు.