Begin typing your search above and press return to search.
ఏపీ సాధించేసిందహో.. 34వేల పెట్టుబడులా? విజయసాయి ట్వీట్ పై పేలుతున్న సెటైర్లు
By: Tupaki Desk | 7 April 2022 9:32 AM GMT‘పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ’.. ఫొటో చూడగానే ఏపీ వాసుల కడుపు నిండుపోయింది. ఎందుకంటే ‘ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఘనంగా చాటాడు. జగన్ ఫారెన్ టూర్ లో దిగిన సూటు బూటు ఫొటోను ముందుపెట్టి.. తన ఫొటోను ఇంకొక పక్క పెట్టుకొని తమ ఘనతను చాటాలనుకున్నాడు. కానీ ఇక్కడే ‘తప్పు’లో కాలేశాడు..
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ బూమరాంగ్ అయ్యింది. పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ నిలిచిందని ఆయన చేసిన ట్వీట్ నవ్వులపాలైంది. ఎందుకంటే ఆయన అనుకున్నదొక్కటి.. అందులో రాసింది మరొకటి.. ఇంకమేందు ప్రత్యర్థులు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. విజయసాయి రెడ్డి ట్వీట్ పై సెటైర్లు కురిపిస్తున్నారు. ఇదేంటి సాయన్న ‘34వేల’ పెట్టుబడులు తెచ్చి అంతా డబ్బు కొట్టుకుంటున్నావ్.?’ అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే?.. విజయసాయిరెడ్డి ఈరోజు ఓ ట్వీట్ చేశాడు. ఏపీ పెట్టుబడుల స్వర్గధామం అంటూ జగన్, తన ఫొటోతో ట్వీట్ చేశారు. కానీ అందులో పెద్ద తప్పు చేశాడు. ఆ ట్వీట్ లో ‘‘‘కరోనా సంక్షోభంతో దేశమంతా కొట్టుమిట్టాడుతోన్న వేళ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరిగాయి.
ఇన్వెస్ట్ ఇండియా తాజాగా వెలువరించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకూ రాష్ట్రంలో 451 అమెరికా డాలర్లు (దాదాపు రూ.34 వేలు మాత్రమే) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఇన్వెస్ట్ ఇండియా సంస్థ పేర్కొంది..’’’ అంటూ విజయసాయిరెడ్డి దిక్కులు పిక్కటిల్లేలా రాసుకొచ్చాడు. తమ ఘనతను చాటుకున్నాడు.
కానీ ఇక్కడ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే .. ఏపీకి విదేశీ పెట్టబడులు కేవలం 451 అమెరికన్ డాలర్లు మాత్రమేనని పేర్కొన్నారు. అంటే మన రూపాయల్లో దాదాపు 34వేల చిల్లర. అంత తక్కువ పెట్టుబడులు వస్తే ఇంత హంగామా? ఏంటి విజయసాయి సార్ అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
అయితే విజయసాయిరెడ్డి ఉద్దేశం 451 మిలియన్ అమెరికన్ డాలర్లు అనుకుంటా.. ‘మిలియన్’ అనే పదం మిస్ కావడంతో వేల కోట్లు కాస్త 34వేల రూపాయలకు పడిపోయి ఉంటుంది. ఈ తప్పును దొరకబుచ్చుకొని ఇప్పుడు టీడీపీ, ఇతర ప్రత్యర్థులు విజయసాయిరెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్నారు.