Begin typing your search above and press return to search.
రాజ్యసభలో కేసీఆర్ లోని మరో కోణాన్ని బయటపెట్టిన పీయూష్
By: Tupaki Desk | 2 April 2022 7:46 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శల అస్త్రాన్ని సంధిస్తూ.. పోరాటాన్ని షురూ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తొలిసారి కొత్త తరహా అనుభవం ఎదురైంది. తాను వేలెత్తి చూపించటమే కాదు.. తనను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా కంట్రోల్ చేస్తున్న ఆయన.. తొలిసారి ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఎదురైంది. కేంద్రంతో ధాన్యం కొనుగోలు లడాయిని మొదలు పెట్టి.. పంజాబ్ లో ఏ తరహా అయితే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారో.. తెలంగాణలోనూ అలానే చేయాలని చెప్పటం తెలిసిందే. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ఇస్తున్న కౌంటర్లకు మోడీ సర్కారు సమర్థవంతంగా సమాధానం చెప్పలేకపోతున్న మాట అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే.
ఇలాంటి వేళ.. కేంద్రం సైతం తెలంగాణ సీఎంపై ఆరోపణ అస్త్రాల్ని సంధించటం షురూ చేసింది. తాజాగా రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్య చేశారు. ధాన్యం కొనుగోలుపై కొందరు మంత్రులు వచ్చి పదే పదే చర్చలు జరిపారు. కొందరు ముఖ్యమంత్రులు ధమ్కీలు ఇచ్చారంటూ చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ను ఉద్దేశించినవేనని చెబుతున్నారు. కేంద్రం మీద సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయటం.. అనంతరం కేసీఆర్ సర్కారులోని మంత్రులు తనను కలిసి చర్చల పేరుతో సమావేశానికి వస్తారని.. ఇలా రెండు నాల్కుల ధోరణితో వ్యవహరిస్తున్నారన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఎవరేం చేసినా తమ వైఖరి మారదని.. మొదట్నించి చెబుతున్నట్లే సాధారణ బియ్యాన్నే తీసుకుంటామన్నారు. తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని.. సాధారణ బియ్యం ఎంత ఇచ్చినా కేంద్రం తీసుకుంటుందన్న ఆయన.. ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కొత్త కథను మొదలు పెట్టినట్లుగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
పంపిణీ చేయటానికి వీలు లేని బియ్యం మీ దగ్గర మిగిలి ఉంటే.. కేంద్ర ప్రభుత్వం వాటిని కొని ఏం చేయాలి? మిగులు ఉప్పుడు బియ్యాన్ని ఇంతకు ముందు తెలంగాణ.. ఒడిశాల నుంచి కూడా సేకరిస్తామని చెప్పారు. నాలుగైదు సంవత్సరాలకు సరిపడా బియ్యం ఉన్నప్పుడు.. సాధారణ బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని ఏడాది నుంచి రాష్ట్రాలకు చెబుతున్నామన్నారు. సాధారణ బియ్యాన్నికాకుండా మరే రకం బియ్యమైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రజలకు పంపిణీ చేసుకోవచ్చన్నారు. ధాన్యం సేకరణ ప్రారంభానికి ముందే 90 శాతం నిధులు రాష్ట్రాలకు చెల్లిస్తున్నట్లుగా చెప్పారు.
అంతేకాదు.. తాము ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని.. సాధారణ బియ్యం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తమకు రాసి ఇచ్చిందని.. ఇప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కొత్త కథను మొదలు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణలోనూ పంజాబ్ తరహాలోనే బియ్యాన్ని సేకరిస్తున్నామని.. ఎంవోయూ ప్రకారమే బియ్యాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. దాన్నిఅవసరమైన రాష్ట్రాలకు పంపుతున్నట్లుగా చెప్పారు.
కేంద్ర మంత్రి పీయూష్ చెప్పిన మాటలకు భిన్నంగా టీఆర్ఎస్ ఎంపీ కేకే వాదన వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తోందని.. నెల తర్వాత కేంద్రండబ్బులు అందిస్తోందన్నారు. ఎప్పటిలానే కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శల అస్త్రాన్ని సంధిస్తూ.. పోరాటాన్ని షురూ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తొలిసారి కొత్త తరహా అనుభవం ఎదురైంది. తాను వేలెత్తి చూపించటమే కాదు.. తనను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా కంట్రోల్ చేస్తున్న ఆయన.. తొలిసారి ఆత్మరక్షణలో పడే పరిస్థితి ఎదురైంది. కేంద్రంతో ధాన్యం కొనుగోలు లడాయిని మొదలు పెట్టి.. పంజాబ్ లో ఏ తరహా అయితే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారో.. తెలంగాణలోనూ అలానే చేయాలని చెప్పటం తెలిసిందే. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ఇస్తున్న కౌంటర్లకు మోడీ సర్కారు సమర్థవంతంగా సమాధానం చెప్పలేకపోతున్న మాట అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి పీయూష్ చెప్పిన మాటలకు భిన్నంగా టీఆర్ఎస్ ఎంపీ కేకే వాదన వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తోందని.. నెల తర్వాత కేంద్రండబ్బులు అందిస్తోందన్నారు. ఎప్పటిలానే కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు.