Begin typing your search above and press return to search.
రఘురామపై రెక్కీ.. చంపేందుకు యత్నించారన్న వైసీపీ రెబల్ ఎంపీ
By: Tupaki Desk | 4 July 2022 1:39 PM GMTవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై రెక్కీ నిర్వహించారా? ఆయనను చంపేందుకు ప్రయత్నించారా? అంటే.. స్వయంగా ఎంపీనే ఔనని అంటున్నారు. రఘురామ కృష్ణరాజు ఇంటి ముందు అపరిచిత వ్యక్తులు గత మూడు రోజులుగా రెక్కీ నిర్వహించా రట. రఘురామ సెక్యూరిటీ సబ్బంది గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక వ్యక్తి దొరికాడు. మిగిలినవారు పారిపోయారు. ఆ వ్యక్తిని విచారించగా పలు రకాలుగా సమాధానం చెబుతున్నాడని ఎంపీ చెప్పారు. తన పేరు బాషా అని, మరొసారి సుభాన్ అని చెబుతున్నట్టు స్వయంగా రఘురామే వివరించారు.
పోలీసు డిపార్టుమెంట్‌కు చెందిన వ్యక్తినని, విజయవాడ, హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తూ ఉంటానని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడకి వచ్చినట్లు ఆ వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పినట్టు రఘురామ ఈ రోజు మీడియాకు చెప్పారు. ఏఆర్ కానిస్టేబుల్‌నని, క్రైమ్ పోలీసునని చెబుతున్నట్టు తెలిపారు. వీఆర్‌లో ఉన్న తనను ఉన్నతాధికారులే ఇక్కడకు తీసుకు వచ్చారని తెలిపాడని చెప్పారు.
``పోలీస్ ఐడీ కార్డ్ చూపించాలని అడగ్గా.. గుర్తింపు కార్డు లేదన్నాడు.`` అని తెలిపారు. తనతో పాటు వచ్చిన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని అడిగారు. ఆ వ్యక్తి నోరు విప్పక పోవడంతో.. రఘురామ సెక్యూరిటీ సిబ్బంది అతని వద్ద ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాలోని రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో సోమవారం పఅల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.
దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. అయితే.. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి తాను హాజరు కావాలని.. రఘురామ భావించారు. దీనికి గాను ఆయన ఆదివారం మధ్యాహ్నమే హైదరాబాద్ వచ్చారు. అక్కడ నుంచి నరసాపురం వచ్చేందుకు రైలు మార్గం ఎంచుకున్నారు. అయితే.. తనను రైల్వే స్టేషన్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అనుసరించారని గమనించిన ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముందు కొందరు రెక్కీ నిర్వహించడం.. సంచలనంగా మారింది.
విషనాగులు పాలకులైతే...
ఇదిలావుంటే, ప్రధాని భీమవరం పర్యటన ప్రొటోకాల్ లిస్టులో తన పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయానని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనను అడ్డుకుంటారని తెలిసే ప్రొటోకాల్ వంటి అంశాలపై ముందే లేఖ రాశానని అయినా.. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదని అసహనం వ్యక్తం చేశారు.
ప్రధాని భీమవరం సభకు తనను రానీయకుండా అడ్డుకున్నారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుంటారని తెలిసే ప్రొటోకాల్ వంటి అంశాలపై ముందే లేఖ రాశానని అయినా.. తన పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలని ప్రశ్నించారు.
``ప్రధాని సభకు రాకుండా నన్ను అడ్డుకున్నారు. విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయి. పర్యటన లిస్టులో నా పేరు లేదని తెలిసి ఆశ్చర్యపోయా. ఇవన్నీ తెలిసే ప్రొటోకాల్ వంటి అంశాలపై ముందే లేఖ రాశా. నా పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థంకావట్లేదు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలి ?`` అని రఘురామ ప్రశ్నించారు.