Begin typing your search above and press return to search.

జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన 'మినిస్టర్ రోజా'

By:  Tupaki Desk   |   11 April 2022 5:47 AM GMT
జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన మినిస్టర్ రోజా
X
ఏపీ కేబినేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సినీ నటి రోజాకు బెర్త్ దక్కింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా రోజాకి మంత్రి పదవి దక్కడంపై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రాజకీయంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆమెను ‘ఐరెన్ లెగ్’ తో పోల్చారు. అలాంటి అవమానాలను భరించి ఓర్పుగా రాజకీయాల్లో కొనసాగినందుకు మంచి ఫలితం దక్కిందని చర్చించుకుంటున్నారు.

నేడు ప్రమాణ స్వీకారం చేయబోయే వారిలో రోజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకు కీలక శాఖ అప్పగించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా రోజా ఇక సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పారు. ఇక నుంచి పూర్తిగా ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని ప్రకటించారు.

తనకు మంత్రి పదవి అవకాశం ఇచ్చిన జగనన్నకు తోడుగా చచ్చేంత వరకు ఉంటానని రోజా ఎమోషన్ గా ప్రకటించారు. ఇక నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వైసీపీలోనే కొనసాగుతానని, జగనన్న ఆధ్వర్యంలోనే పనిచేస్తానని అన్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇక నుంచి సీఎం జగనన్న చెప్పిన ప్రతి పనిని విధిగా పాటిస్తానని చెప్పారు. జగనన్న పాలనలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం పెరిగిందని, ప్రతి మహిళా శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్న జగన్ సీఎంగా ఉండడం మా అదృష్టం అని రోజా అన్నారు.

టీడీపీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన తాను ఎన్నో అవమానాలకు గురయ్యాయని రోజా అన్నారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని బాబు శపథం చేశారని, కానీ ఇప్పుడు మంత్రి హోదాలో అసెంబ్లీకి వెళుతున్నానన్నారు. ఇదంతా జగనన్నచలువే అని అన్నారు. తనను ఐరెన్ లెగ్ అని టీడీపీ నాయకులు హేళన చేశారని, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టడం చూసి వారేమనుకుంటారో.. వారికే వదిలేస్తానని అన్నారు. ఇక నుంచి మంత్రిగా ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతానని అన్నారు.

మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా రోజా సినీ ఫీల్డుకు గుడ్ బై చెప్పారు. ఇక నుంచి సినిమా షూటింగులో పాల్గొనేది లేదని, పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతానని అన్నారు. దీంతో రోజా పనిచేసిన జబర్దస్త్ ప్రొగ్రాం కు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఈ ప్రొగ్రాం ప్రారంభం నుంచి రోజా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆమని, ఇంద్రజలు జడ్జిగా కొనసాగుతున్నారు. అయితే కామెడీగా అయిన రోజాకు హోంమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. మరి రోజాకు ఎలాంటి శాఖ వస్తుందోనని ఆమె అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.