Begin typing your search above and press return to search.

ఆర్థిక సంక్షోభం: భారత్ కు శ్రీలంక తమిళలు వలసలు

By:  Tupaki Desk   |   25 March 2022 8:29 AM GMT
ఆర్థిక సంక్షోభం: భారత్ కు శ్రీలంక తమిళలు వలసలు
X
శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. కోడిగుడ్డు ఒకటి రూ.35కి చేరింది. కిలో చికెన్ రూ.1000, కేజీ ఉల్లి రూ.200, పాలపొడి రూ.2000, పెట్రోల్ లీటర్ రూ.283, డీజిల్ లీటర్ రూ.220.. ఇలా అన్ని ధరలు శ్రీలంకలో విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆ దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం వైపు ప్రజలను మార్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఈ నిర్ణయం కారణంగానే దేశంలో ఆహార పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతోపాటు కరోనా కష్టాలు, అప్పులు శ్రీలంకను పీకల్లోతు కష్టాల్లో పడేశాయి. పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల వరకూ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పెట్రోల్, గ్యాస్ స్టేషన్ల వద్ద ఆర్మీని సెక్యూరిటీగా పెట్టారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో అక్కడ ఉన్న శ్రీలంక తమిళులు, కొందరు శ్రీలంక జాతీయులు భారత్ కు అక్రమంగా వలస వస్తున్నారు. సముద్రమార్గం ద్వారా వస్తున్న వీరిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంటోంది.

శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా రామేశ్వరం, ధనుష్కోటికి శ్రీలంక తమిళులు భారీగా వలస వస్తున్నారు. రామేశ్వరం శరణార్థుల నిలయంలో శ్రీలంక తమిళులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.