Begin typing your search above and press return to search.
కరోనా పరిహారం పేరుతో నిధులు స్వాహా.. ఏపీపై సుప్రీం సంచలన ఆదేశాలు
By: Tupaki Desk | 24 March 2022 1:30 PM GMTకరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ.. కొన్నాళ్ల కిందట.. సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో విపత్తు నిధుల కింద.. ఆ యా మొత్తాలను బాధిత కుటుంబాలకు ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం పేరుతొ నిధులను పక్కదారి పట్టించిన వైనం ఆంధ్రప్రదేశ్ సహా.. ఇతర రాష్ట్రాల్లోనూ చోటు చేసుకున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.
అంటే.. సాధారణ మరణాలను కూడా కరోనా మరణాలుగా చూపిస్తూ.. నకిలీ దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో వైసీపీ, ఇతర పార్టీలకు చందిన నాయకులు ప్రమేయం ఉందంటూ.. ప్రజాసంఘాల నాయకులు.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అదేవింగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి అభ్యర్థనలే వచ్చాయి. వీటిని సమగ్రంగా విచారించిన సుప్రీం కోర్టు.. కరోనా మృతులకు సంబంధించి వచ్చిన నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రానికి అనుమతినిచ్చింది.
మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన మరణాల సంఖ్య.. పరిహారం కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు పొంతనలేని కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఐదు శాతం దరఖాస్తులపై దర్యాప్తు చేసే వెసులుబాటును కల్పించింది. మృతుల కుటుంబీకులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే కాల వ్యవధిని 30 రోజులే ఇవ్వాలనే కేంద్రం అభ్యర్థనపై సుప్రీం స్పందించింది. పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే వ్యవధిని 60 రోజులుగా నిర్ణయించింది.
భవిష్యత్లో సంభవించే కరోనా మరణాల విషయంలో ఆ వ్యవధిని 90 రోజులుగా పేర్కొంది. కరోనా మృతు ల కుటుంబాలకు రూ.50,000 పరిహారం చెల్లింపులో అవకతవకలపై సుప్రీంకోర్టు గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు అనైతికమైనవని పేర్కొంది. పరిహారం చెల్లింపు పారదర్శకంగా జరగడానికి అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించింది.
హిజాబ్‌కు పరీక్షలతో సంబంధం లేదు!
తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యార్థులకు పరీక్షలు రానున్నందున ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. పరీక్షలకు ఈ అంశంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. తరగతి గదుల్లో హిజాబ్ ధారణను నిరాకరించడం సహా అది ఇస్లాం మతాచారాల్లో భాగం కాదని ఇటీవల కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది.