Begin typing your search above and press return to search.
11వ తేదీ...11.31 గంటలకు...కొత్త మంత్రుల ప్రమాణం
By: Tupaki Desk | 5 April 2022 12:30 PM GMTఏపీలో కొత్త మంత్రి మండలి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు దివ్యమైన ముహూర్తాన కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారి చేత ప్రమాణం చేయిస్తారు.
ఇక కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే వేదికను కూడా ఎంపిక చేశారు. వెలగపూడిలోని సచివాలయ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కొత్త మంత్రులు ఎవరు అన్నది ఇప్పటికైతే తెలియదు, కానీ ఈ నెల 7వ తేదీ తరువాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఆ రోజున మధ్యాహ్యం మూడు గంటలకు ప్రస్తుత మంత్రిమండలి చివరి సారిగా భేటీ అవుతుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం తరువాత టోటల్ గా మంత్రిమండలి రాజీనామాలు చేస్తుంది. ఆ తరువాత కొత్త మంత్రులు ఎవరో కూడా తెలుస్తుంది అంటున్నారు. ఇప్పటికే కొందరికి ఈ విషయం మీద సిగ్నల్స్ అయితే వెళ్లాయని చెబుతున్నారు.
అవకాశం ఉన్న వారు అందుబాటులో ఉండాలని సూచనలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. తొలి విడత మంత్రివర్గం మాదిరిగానే మలి విడతలో కూడా అనేక ట్విస్టులు ఉంటాయని అనూహ్యమైన పేర్లు కూడా తెర మీదకు వస్తాయని చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న పేర్లు కాకుండా కొత్త పేర్లను చూడవచ్చు అంటున్నారు. అలాగే ఎవరూ అనుకోని వారు కూడా మంత్రులుగా ప్రమాణం చేయవచ్చు అని అంటున్నారు. మొత్తానికి కొత్త మంత్రివర్గం మీద జగన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది అని తెలుస్తోంది. మొత్తానికి ముహూర్తం ఫిక్స్ అయింది. టెన్షన్ కూడా అందరిలో పెరిగిపోతోంది