Begin typing your search above and press return to search.

వైరల్ వీడియ్ షాక్.. విద్యార్థులతో ఆ టీచర్ సామూహిక శృంగారం

By:  Tupaki Desk   |   10 April 2022 5:31 AM GMT
వైరల్ వీడియ్ షాక్.. విద్యార్థులతో ఆ టీచర్ సామూహిక శృంగారం
X
అక్కడెక్కడో ఉన్న పశ్చిమ దేశాల్లో జరిగే కొన్ని అసాధారణ ఉదంతాలు ఇటీవల కాలంలో మన దగ్గరా చోటు చేసుకుంటున్నాయి. విన్నంతనే వికారం పుట్టే ఈ తరహా ఉదంతాలు చూస్తుంటే.. మన పయనం ఎటు సాగుతుందన్న కొత్త సందేహం కలుగక మానదు. సమాజంలో గౌరవనీయ కొలువుగా పరిగణించే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి.. ఆ ప్రొఫెషన్ కు కళంకాన్ని తెచ్చి పెట్టే ఉదంతం తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వైరల్ వీడియో బయటకు రావటంతో ఈ దరిద్రం బయటకు వచ్చింది.

విద్యార్థులకు మంచి భవితను అందించాల్సిన ఒక టీచరమ్మ అందుకు భిన్నంగా నీచంగా వ్యవహరించింది. ఆమె దారుణ ప్రవర్తన తమిళనాడులో పెను సంచలనంగా మారింది. అంతేకాదు.. కొత్త చర్చకు తెర తీసింది. మధురైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పని చేసే 42 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఒక బిజినెస్ మ్యాన్ తో రిలేషన్ లో ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే తేడా కొట్టేసింది. కొద్ది రోజుల క్రితం తన స్కూల్లో చదివే ముగ్గురు మైనర్ విద్యార్థుల్ని తన ఇంటికి తీసుకెళ్లింది.

ఆ ముగ్గురితో ఒకేసారి సామూహిక శృంగారాన్ని సాగించింది. ఇదే దరిద్రం అనుకుంటే.. ఇంతకంటే నీచం ఏమంటే.. ఈ మొత్తాన్ని తన ప్రియుడైన వ్యాపారవేత్తతో రికార్డు చేయించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావటం.. ఇది కాస్తా సోషల్ మీడియా.. వాట్సాప్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా ముక్కున వేలేసకుంటున్నారు. ఇదేం పోయేకాలమని వాపోతున్నారు. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంపై రాష్ట్ర డీజీపీ స్పందించారు.

ప్రభుత్వ టీచర్ ను.. ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అంతేకాదు.. మైనర్ బాలురుతో సెక్సు చేసినందుకు సదరు టీచర్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఈ బరితెగింపు చర్యను ఎందుకు వీడియోగా తీశారు? అన్నది మాత్రం ప్రశ్నగా మారింది. గురువును దైవంగా భావించి పూజించే దేశంలో.. సదరు గురువే.. ఇలాంటి పాపానికి తెర తీయటాన్ని ఏమనాలి?