Begin typing your search above and press return to search.

జాతీయ రాజ‌కీయాలపై క‌విత ముద్ర‌.. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   10 April 2022 8:12 AM GMT
జాతీయ రాజ‌కీయాలపై క‌విత ముద్ర‌.. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన కేసీఆర్‌
X
నోరు విప్పితే.. మాట‌ల తూటాలు.. ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. అదే రేంజ్‌లో రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌తో విరు చుకుప‌డే.. యువ నాయ‌కురాలు.. వెర‌సి.. కేసీఆర్ కుమార్తె క‌ల్వకుంట్ల కవిత‌. ఇప్పటి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో కీల‌క బాధ్య‌తలు చూస్తున్న క‌విత‌.. ఎంపీగా.. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా పార్టీలో కీల‌క రోల్ పోషిస్తున్నారు. హిందీఅయినా.. ఇంగ్లీష్ అయినా.. తెలుగు అయినా.. భాష ఏదైనా.. త‌న వాక్చాతుర్యంతో దూకుడు ప్ర‌ద‌ర్శించే నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. అలాంటి క‌విత‌కు ఇప్పుడు సూప‌ర్ బ్రేక్ రానుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని.. ఉత్సాహంతో అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కేం ద్రంలోని మోడీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో యుద్ధం చేయాల‌ని రెడీ అయ్యారు. వారం రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న సీఎం.. జాతీయ రాజకీయాల్లో భవిష్యత్ పాత్ర పైన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో జాతీయ‌స్థాయి నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంతోపాటు.. వారితో చ‌ర్చ‌లు జ‌రిపే బాద్య‌త‌ల‌ను క‌విత‌కు అప్ప‌గించార‌ని తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేసే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలోనూ.. కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నా రు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు పార్టీల నేత‌ల‌తో ఆయ‌న భేటీ అయి చ‌ర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక ల ఫ‌లితాల అనంత‌రం.. కొంత దూకుడు త‌గ్గించినా.. ఇప్పుడు మ‌ళ్లీ కేసీఆర్ త‌న వ్యూహాన్ని అమ‌లు చేయ‌డంలో వేగం పెంచారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే ఢిల్లీలేదా.. హైద‌రాబాద్లో బీజేపీ వ్య‌తిరేక కూట‌మిలో చేరాల‌నుకునే పార్టీల‌తో క‌లిసి.. పెద్ద ఎత్తున స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌మావేశం స‌క్సెస్ చేసి.. బీజేపీని ఆత్మ‌ర‌క్షణ‌లో ప‌డేయాల‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో సమావేశం పైన తాజాగా కేసీఆర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌తో సమావేశమైన కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపైన చర్చించారు. ఈ నేప‌థ్యంలో జాతీయ రాజకీయాల్లో కవితకు కేసీఆర్ బాధ్యతలు అప్పగిస్తున్నార‌ని తెలుస్తోంది. సమాజ్‌వాద్‌ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో సంప్రదింపుల బాధ్యతను ఎమ్మెల్సీ కవిత చూసుకుంటున్నారు.

అదేవిధంగా రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు, బిహార్‌ విపక్ష నేత తేజస్వీ యాదవ్‌ స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇక, కేసీఆర్ జాతీయ రాజకీయాల అజెండాతో అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయాల్లోనూ కవిత సీఎం వెంటే ఉన్నారు. మరోవైపు కేసీఆర్‌తోపాటు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కవిత తన బృందంతో కలిసి జాతీయస్థాయి మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లతో వరుస భేటీలు జరుపుతున్నారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. క‌విత‌ను జాతీయ స్థాయిలో వినియోగించుకుని.. గ‌తంలో ఎంపీగా ప‌నిచేసిన క‌విత అనుభ‌వాన్ని వినియోగించుకోవాల‌ని.. కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. భాషా ప‌రంగా కూడా ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేక పోవ‌డం.. స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందించ‌డం.. వంటివి..క‌విత‌కు ప్ల‌స్‌గా మారుతున్నాయి. మ‌రో వైపు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేలా ఒక సీనియర్ జర్నలిస్టును కేసీఆర్ ఢిల్లీలో నియ‌మించినట్టు తెలిసింది.

ఇదిలావుంటే.. యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబందించి టీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో కేంద్రం తీరు పైన నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. సోమ‌వారం జ‌రిగే ఈ నిర‌స‌న‌కు స్వ‌యంగా సీఎం కేసీఆర్ హాజ‌రు అవుతార‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో 12న మంత్రివర్గ సమావేశంలో కేంద్రం పైన పోరాటా నికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఢిల్లీ టూర్‌ తర్వాత మళ్లీ టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు అంశంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

దీంతో..కేసీఆర్ ఇటు తెలంగాణ .. అటు జాతీయ రాజకీయాల్లో కీలకంగా తన అడుగులు పక్కా వ్యూహాత్మ కంగా వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇటు రాష్ట్రంలో కేటీఆర్.. అటు జాతీయ రాజకీయాల్లో కవిత కు ప్రాధాన్యత పెరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మ‌రి ఎలా దూసుకుపోతారో చూడాలి.