Begin typing your search above and press return to search.
బొత్సకు విద్యా శాఖ ఇవ్వటమేమో కానీ ఆడేసుకుంటున్నారుగా?
By: Tupaki Desk | 13 April 2022 5:16 AM GMTసోషల్ మీడియా పుణ్యమా అని చిత్రమైన అంశాలు ప్రధాన వార్తాంశాలుగా మారిపోవటమే కాదు.. కొందరు నేతల ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తుంది. నారా లోకేశ్ ను తక్కువ చేసి చూపించటం కోసం.. బాబు రాజకీయ వారసుడన్న భావనకు చెక్ పెట్టేలా జరిగిన సోషల్ మీడియా ఆయనపైన ఎంత ప్రభావం చూపిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లోకేశ్ మంత్రిగా ఉన్న వేళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఎంతలా టార్గెట్ చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లోకేశ్ అన్నంతనే పప్పు గుర్తుకు వచ్చేలా కామెడీ చేసిన వైనం తెలిసిందే. ఇలా నేతల్ని చిన్నబుచ్చేలా.. వారి ఇమేజ్ ఖరాబు అయ్యేలా బ్రాండింగ్ చేసేందుకు సోషల్ మీడియా ఒక ఆయుధంగా మారింది.
తాజాగా జగన్ మీద ఉన్న కోపం సీనియర్ మంత్రి బొత్సకు ఇబ్బందికరంగా మారింది. జగన్ నిర్ణయాల్ని తప్పు పట్టే క్రమంలో.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా వ్యవహరిస్తున్న తీరు.. మంత్రిగా ఎంతో అనుభవం ఉండి.. అనేక శాఖల్ని చేపట్టిన బొత్సకు విద్యా శాఖా మంత్రిగా మాత్రం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
బొత్స మాటలు.. ఆయన చేసే కామెంట్లు చూసినంతనే ఆయన పెద్దగా చదువు లేదన్నట్లుగా ఫీల్ అవుతారు. ఇందుకు తగ్గట్లే జరిగే ప్రచారం తోడవుతుంది. దివంగత మహానేత వైఎస్ ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరించిన ఆయనకు.. విద్యా శాఖ అన్నది పెద్ద ఫోర్టు ఫోలియోనే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటిది ఆయన్ను టార్గెట్ చేస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది.
బొత్సకు విద్యా శాఖ ఇచ్చినట్లు ప్రకటన వెలువడినంతనే.. సోషల్ మీడియాలో ‘ఆయన నోటితో సరస్వతి నమస్తుభ్యం చెప్పే వినాలని ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్య వాట్సాప్ లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఇంగ్లిషు భాషా ప్రావీణ్యం ఎలా ఉంటుందో తెలుసా? అంటూ కొన్ని పాత వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. బహుభాషా కోవిదుడిగా చెప్పే కేసీఆర్ సైతం. ఇంగ్లీషులో వీక్. అందుకే ఆయన పలు అంతర్జాతీయ వేదికల మీద తాను కాకుండా తన కుమారుడ్ని చూసుకోవాలంటూ పంపుతారు.
నిజమే బొత్సకు ఇంగ్లిషు మీద పట్టు లేదు. ఆ మాటకు వస్తే తెలుగు మీద కూడా పట్టు తక్కువే. ఆయన మాట బొంగురుగా ఉండటం.. నత్తిగా ఉండటాన్ని గతంలో పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. మారిన పరిస్థితుల్లో ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. చాలామంది బొత్స పెద్దగా చదువు లేదని భావిస్తారు. కానీ.. ఆయన విజయనగరం మహారాజా కాలేజీలో బీఏ డిగ్రీ చేశారు.
డిగ్రీ చదివిన వ్యక్తికి విద్యా శాఖ ఇవ్వటం తప్పేమీ కాదు. దీనికి తోడు బోలెడంత అనుభవం ఉంది. కానీ.. జగన్ మీద ఉన్న కోపం.. బొత్స మీద తీర్చుకోవటానికి ఆయనకున్న సరిగా మాట్లాడలేని సమస్యను అస్త్రంగా చేసుకొని చేస్తున్న సోషల్ ప్రచారంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతంలో మరే శాఖను చేపట్టినప్పడు కూడా ఇలాంటి పరిస్థితి బొత్సకు ఎదురు కాలేదని చెబుతారు.

There there there that’s these things have happened