Begin typing your search above and press return to search.
రాహుల్ పై కవిత.. కవితపై రేవంత్.. ట్వీట్ వార్
By: Tupaki Desk | 29 March 2022 9:30 AM GMTధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంధించిన ట్వీట్ వార్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు కాస్త గట్టిగానే తగిలింది. బీజేపీ, టీఆర్ఎస్ ధాన్యం కొనుగోళ్లతో నాటకాలు ఆడుతున్నాయని రాహుల్ విమర్శించారు. ఈ క్రమంలోనే రెండు ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.’ అంటూ తెలుగులో రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం విశేషం.
రాహుల్ గాంధీ ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్ లో సంఘీభావం తెలుపడం సరికాదని హితవు పలికారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదని చెప్పారు. పంజాబ్, హర్యానాలో చేసినట్లు తెలంగాణ ధాన్యం కూడా సేకరించాలని కోరుతున్నామన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్నారని కవిత తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే సేకరణ విధానం’ కోసం రాహుల్ డిమాండ్ చేయాలని కవిత సూచించారు.
ఎమ్మెల్సీ కవిత ఏకంగా రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కవితకు గట్టి కౌంటర్ ట్వీట్ వేశారు. ‘పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయడం అబద్దమన్నారు. ‘కవిత గారూ...టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?’అంటూ గట్టిగా రేవంత్ రెడ్డి నిలదీశారు.
తెలంగాణ రైతుల ఆవేదనను అర్తం చేసుకున్న రాహుల్ కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ధాన్యం సేకరణలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరి దారుణమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
మొత్తం మీద టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న వరియుద్ధంలోకి కొత్తగా కాంగ్రెస్ ఎంట్రీ కావడం ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఈ రెండు పార్టీల నైజాన్ని బయటపెట్టేందుకు ఏకంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగడం విశేషం.