Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ స్పీక్స్ : రఘునందనందనా ! మాట మార్చావా?
By: Tupaki Desk | 2 April 2022 12:30 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితిని నిరంతరం వెన్నాడే నేతగా, ఇంకా చెప్పాలంటే మామపై తిరుగుబాటు చేసిన నేతగా రఘునందన్ కు పేరు ఉంది. వాస్తవానికి దుబ్బాక ఫైట్ ను కూడా చాలా తీవ్రం చేసి ఆఖరి నిమిషం వరకూ తన సత్తా నిలుపుకునేందుకు ప్రయత్నించిన పోరాట యోధుడు కూడా ఆయనే! ఆ తరువాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని వీడని కార్యకర్తలతో టచ్ లో ఉంటూ తనదైన పాలిటిక్స్ ను నడుపుతున్నారని టాక్ కూడా ఉంది. అయినా కూడా రఘునందన్ అంటే తెలంగాణ ఇంటి పార్టీకి సాఫ్ట్ కార్నరే ఉంది.
అందుకే నిన్నటి వేళ ఆయనింట వేడుకకు వెళ్లారు.ఇదే సమయంలో హరీశ్ రావునో, తలసాని శ్రీనునో తప్పుపట్టక, దుబ్బాక ఎమ్మెల్యే అయిన రఘునందన్ ను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. ఇంటా,బయటా గులాబీ దండుతో నడిచే రఘనందన్ ఎటువంటి వారో తెలుసుకోవాలని ఆయన వెంట నడుస్తున్న బీజేపీ కార్యకర్తలు ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు చెబుతున్నారు.
రాజకీయాల్లో నువ్వా నేనా అని తలపడే నేతలు, ఆ విషయమై తరుచూ తడబడే నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన కుమార్తె తో హైద్రాబాద్ లో కొత్త ఆస్పత్రిని ప్రారంభింపజేశారు.ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావు (వైద్యారోగ్యం), మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (సినిమాటోగ్రఫీ) విచ్చేసి రఘునందనరావు కుమార్తెను ఆశీర్వదించారు.
ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. పొద్దున లేస్తే చాలు తెలంగాణ రాష్ట్ర సమితిపై పోరాటం చేస్తూ, విమర్శాస్త్రాలు సంధించే రఘునందన్ మాట తప్పారని అంటున్నాయి. ఆ రోజు తాను గెలిస్తే తన కుమార్తెతో దుబ్బాకలో ఆస్పత్రి పెట్టించి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తానని చెప్పారని గుర్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో బయటొక మాట,లోపల ఒక మాట అంటున్న రఘునందన్ ను ఎవ్వరూ నమ్మరని కూడా అంటున్నాయి. వీటిపై రఘు నందన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.