Begin typing your search above and press return to search.
వరుస పెట్టి ఫోన్లు చేస్తున్న రాజ్ నాథ్ అనుభవం ఏమిటి?
By: Tupaki Desk | 16 Jun 2022 8:30 AM GMTపేరుకు అధికారపక్షమే కానీ.. మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తిరుగులేని రాజకీయ అధినేతగా పేరున్న మోడీకి.. రాష్ట్రపతి ఎన్నిక వేళ.. తాము నిలబెట్టే అభ్యర్థిని గెలిపించుకునే సొంత బలం లేకపోవటం మహా ఇబ్బందిగా మారింది. అందుకే.. గతానికి భిన్నంగా ఏకగ్రీవ అభ్యర్థిని బరిలోకి దించాలన్న కొత్త నినాదంతో విపక్షాల్ని సంప్రదించే పనిని పురమాయించారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు. పార్టీ అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా తన ప్రయత్నాల్ని షురూ చేశారాయన.
ఇందులో భాగంగా బుధవారం వివిధ పార్టీల అధినేతలకు స్వయంగా ఫోన్ చేశారు. ఓవైపు విపక్షాలన్ని కూర్చొని ఏకగ్రీవ నిర్ణయంతో తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న వేళ.. రాజ్ నాథ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగి అటు కాంగ్రెస్ నుంచి ఇటు టీఎంసీ వరకు పార్టీ ముఖ్యనేతలకు ఫోన్లు చేయటం.. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలంటూ చేస్తున్న విన్నపం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేతో ఫోన్ చేసి మాట్లాడిన రాజ్ నాథ్.. సాయంత్రం టీఎంసీ అధినేత్రి.. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ మాట్లాడారు. మరికొందరుపార్టీ అధినేతలతోనూ ఆయన మాట్లాడారు.
అయితే.. రాజ్ నాథ్ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదంటున్నారు. ఆయన వాదనను సావధానంగా వింటున్న విపక్ష నేతలు.. తమ అభిప్రాయాన్ని త్వరలోనే చెబుతామని చెబుతున్నారు.
విపక్ష నేతల తీరు రాజ్ నాథ్ ను ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యంగా ఉండటంతో.. ఆమె కోలుకున్న తర్వాత రాజ్ నాథ్ ఫోన్ సమాచారాన్ని ఆమెకు చేరవేస్తామని రాజ్ నాథ్ కు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
మొత్తంగా చూస్తే.. రాజ్ నాథ్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించటం లేదన్న మాట వినిపిస్తోంది. తమ మాటను వినని విపక్షాల్ని అడిగి లేదనిపించే వ్యూహం చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరేదో ప్లానింగ్ లో కమలనాథులు ఉన్నారా? అన్న భావన కలుగక మానదు.