Begin typing your search above and press return to search.
మత్తు విశాఖ...గమ్మత్తు విశాఖ...?
By: Tupaki Desk | 2 May 2022 8:28 AM GMTపాతిక లక్షల జనాభా కలిగిన విశాఖను మత్తు విశాఖ అనడం నేరం, పాపం, ఘోరం కూడా. ఎందుకంటే ఏ కొద్ది శాతంలో ఇలాంటి గమ్మత్తు పనులు చేస్తూ ఉంటారు. ఆ పాడు పనులతో విశాఖకు కళంకం అంటుతుందా అంటే విశాఖ పేరు చెప్పే కదా ఎవరైనా విషయాన్ని చెప్పేది. ఆ విధంగా చూస్తే విశాఖకు ఇపుడు ఈ మాయదారి మత్తు పట్టుకుంది. అది గంజాయి తో మొదలై. మాదకద్రవ్యాలతో కొనసాగుతూ ఆఖరుకు వైద్య సేవలలో వినియోగించే మత్తు ఇంజెక్షన్ల దాకా కధ వచ్చేసింది.
దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే మత్తుతో విశాఖ చిత్తు అవుతోందని, యువత మీద దీని ప్రభావం బాగా పడుతోందని, కొంతమంది బ్రోకర్లు మత్తు వ్యాపారాన్ని నమ్ముకుని బంగారం లాంటి యువత జీవితాలను బలి పెడుతున్నారు అని కూడా విమర్శలు ఉన్నాయి. ఆఖరుకు పదవ తరగతి గది దాటి కాలేజి గడప ఎక్కుతున్న ముక్కుపచ్చలారని ఇంటర్ విద్యార్ధులకు కూడా ఈ మత్తు రుచి చూపించి మజా చేసుకుంటున్న దళారులతోనే ఇదంతా సాగుతోంది.
ఇక విశాఖలో లేటెస్ట్ గా నిషేధిక మత్తు ఇంజెక్షన్ల కలకలం ఒక్కసారిగా చెలరేగింగి. దాంతో తీగ ఎక్కడ ఉంది. డొంక సంగతేంటి అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. విశాఖలోని వెంకోజీపాలెం ప్రాంతంలో కొంతమంది యువకులు ఇంజక్షన్లను యువతకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తాజాగా విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ మ్యాటర్ వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు యువకులు మత్తు ఇంజెక్షన్లను యువతకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో వారి నుంచి ఏకంగా 270 దాకా మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ మత్తు ఇంజెక్షన్లు ఆపరేషన్ ధియేటర్లలో రోగులకు అవసరం మేరకు వైద్యులు ఉపయోగిస్తారు అని చెబుతున్నారు. ఈ ఇంజక్షన్‌ను శస్త్రచికిత్స అనంతరం పెయిన్ కిల్లర్‌గా ఉపయోగిస్తారని, వీటిని కేవలం ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో మాత్రమే విక్రయించాల్సి ఉందని పొలీసులు చెబుతున్నారు.
మరి అవి ఈ యువకుల చేతుల్లోకి ఎలా వచ్చాయి. దీని వెనక ఉన్న రాకెట్ ఏంటి అన్నది తేలాల్సి ఉంది. ఇక ఈ 50 ఇంజక్షన్లను కలిగిన బాక్సును ఆరు వేల రూపాయలకు కొనుగోలు చేసి, ఒక్కో ఇంజక్షన్‌ను బయట 300రూపాయల దాకా విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అదే విధంగా టోకున ఒక్కో బాక్సు10 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు.
ఇలా మత్తు ఇంజెక్షన్ల సరఫరా ఎవరెవరికి సాగుతోంది, ఇంత పెద్ద ఎత్తున విక్రయాలు ఎలా చేయగలుతున్నారు. వాటికి అలవాటు పడుతున్న యువత, వారిని లోబరచుకుంటున్న ముఠా ఎవరు అన్న దాని మీద పోలీసులు దృష్టి పెడుతున్నారు. మొత్తానికి విశాఖలో ఇపుడు యువతకు భయంకరమైన వ్యసనంగా మత్తు ఆవహించింది అన్నది వరసబెట్టి జరుగుతున్న సంఘటనల బట్టి తెలుస్తోంది.