Begin typing your search above and press return to search.

గ్రాఫిక్స్ తో జనాలను బఫూన్లు చేసిన ఛానల్

By:  Tupaki Desk   |   9 Dec 2015 4:15 AM GMT
గ్రాఫిక్స్ తో జనాలను బఫూన్లు చేసిన ఛానల్
X
పోటీ ఉండటం తప్పేం కాదు. కానీ.. ఆ రేసులో పడి విలువలకు తిలోదకాలు ఇవ్వటం చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. మిగిలిన ఛానళ్ల కంటే ముందు ఉన్నామన్న పేరు ప్రఖ్యాతుల్ని కొట్టేయటం కోసం.. ఓ ఛానల్ చేసిన గ్రాఫిక్ మేజిక బయటకు రావటమే కాదు.. ఆ ఛానెల్ తీరుపై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి.

చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాల్ని లైవ్ లో చూపించటం.. అక్కడి తీవ్రతను మరింత బాగా అర్థం కావటం కోసమన్నట్లుగా వ్యవహరించి అభాసుపాలైందో ఛానల్. చెన్నైను ముంచెత్తిన వరద పోటును ‘లైవ్లీ’గా చూపించాలన్న ఆలోచనతో గ్రాఫిక్స్ ను మిక్స్ చేసి.. న్యూస్ రీడన్ ను నీటిలో మునిగినట్లుగా చూపించింది. చేసింది గ్రాఫిక్స్ అయినా.. జరిగింది మాత్రం లైవ్ అన్నట్లుగా చెప్పి అందరిని పిచ్చోళ్లనుచేసింది.

శతాబ్ద కాలంలో లేనంత భారీ వర్షం చెన్నైని ముంచెత్తిన నేపథ్యంలో.. భారీగా పెరిగిన వరద నీటి తీవ్రతను చూపించటం కోసం.. మోకాళ్ల కంటే దిగువన ఉన్న నీటిలో నిలుచున్న యాంకర్ ను.. చెన్నైలో వరద తీవ్ర భారీగా పెరిగిందన్న భావన కలిగించుందకు వీలుగా.. అదే యాంకరమ్మ నడుము కింది భాగం పూర్తిగా వరద నీటిలోమునిగిపోయిందన్న రీతిలో గ్రాఫిక్స్ ను తయారు చేసి వార్తలు ప్రసారం చేసింది.

సాంకేతిక అందరికి అర్థమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి పిల్ల తరహా యవ్వారాలు దాగవు కదా. అందుకే.. తేజ్ న్యూస్ ఛానల్ వాళ్లు స్టూడియోలో ఉండి గ్రాఫిక్స్ తో చేసిన ఈ వ్యవహారం ఇప్పుడు బయటకు రావటమే కాదు.. విలువలకు మరీ ఇంతగా నీళ్లు వదలాల్సిన అవసరం ఉందా? అంటూ మండిపడుతున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ చేసిన వ్యవహారంపై ఇప్పటివరకూ ఆ ఛానల్ రియాక్ట్ కాలేదు. సంచలనాల కోసం ఇలాంటి జిమ్మిక్కులు అవసరమా..?