Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో కీలకనేత గుడ్ బై..!
By: Tupaki Desk | 21 Feb 2021 11:20 AM GMTతీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఆ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదర్కొంటున్నది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని ఇటీవలే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే పార్టీలోని ఓ వర్గం ఆయన పట్ల తీవ్ర విముఖతతో ఉంది అది వేరే విషయం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీని వీడబోతున్నట్టు సమాచారం. ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీశైలం గౌడ్ 2009లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందాడు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ టీడీపీ అభ్యర్థి వివేకానందగౌడ్ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా మళ్లీ వివేకానంద్ చేతిలో ఓడిపోయారు. అయితే 2018లో వివేకానంద్ టీఆర్ఎస్ తరఫున పోటీచేశారు. వరసగా రెండుసార్లు ఓడిపోవడంతో కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పరస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. అయితే ఆ పార్టీ మాత్రం పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమించడంతో జాప్యం చేస్తోంది. ఇటీవల రేవంత్‌రెడ్డి పేరు బలంగా వినిపించింది. దీంతో కాంగ్రెస్ సీనియర్లు భగ్గుమన్నారు.
ఇంతకాలం పార్టీకి సేవలుచేసిన మమ్మల్ని కాదని .. కొత్తగా టీడీపీ నుంచి వ్యక్తికి ఎలా పదవి అప్పజెపుతారంటూ సొంతపార్టీలోనే కుంపటి రగిలింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం మెత్తబడింది.ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్టు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పార్టీలోనూ కొంత నూతనోత్సాహం వచ్చింది. ఈ క్రమంలో కీలకనేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం గమనార్హం.